విలన్‌గా చేయనంటున్న శ్రీదేవి | Did Sridevi say no to villainous role in 'Fitoor'? | Sakshi
Sakshi News home page

విలన్‌గా చేయనంటున్న శ్రీదేవి

Published Sun, Oct 20 2013 12:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

విలన్‌గా చేయనంటున్న శ్రీదేవి

విలన్‌గా చేయనంటున్న శ్రీదేవి

అందం అంటే ఆమెదే అని నాటి తరంవారు శ్రీదేవికి వందకు వంద మార్కులిచ్చేశారు. నేటి తరంలోనూ ఈ అందానికి బోల్డంత మంది అభిమానులున్నారు. అందుకే ఫిఫ్టీ ప్లస్‌లో ఉన్నా శ్రీదేవిని అక్క, వదిన, అత్త పాత్రల్లో చూడ్డానికి ఆమె అభిమానులు ఇష్టపడటంలేదు. ఆ మాటకొస్తే.. శ్రీదేవికీ ఆ పాత్రలు చేయడం పెద్దగా ఇష్టం లేదు. చివరకు యాంటీ రోల్స్ చేయడానికి కూడా ఆమె ఆసక్తి కనబర్చడంలేదని సమాచారం. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవికి ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. 
 
 కానీ పాత్రల ఎంపిక విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కై పో చే’ ఫేం అభిషేక్‌కపూర్ తను దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘ఫితూర్’లో శ్రీదేవిని ప్రతినాయిక ఛాయలున్న పాత్రకు తీసుకోవాలనుకున్నారట. హాలీవుడ్ చిత్రం ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ ఆధారంగా ఆయన ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారు. అందులో నటుడు రాబర్ట్ డి నీరో చేసిన పాత్రను హిందీ వెర్షన్‌లో శ్రీదేవితో చేయించాలన్నది అభిషేక్ ఆలోచన. అందుకని ఈ కథను లేడీ ఓరియంటెడ్‌గా మార్చారట.
 
  అయితే ప్రతినాయికగా నటించడం ఇష్టం లేక ఈ చిత్రాన్ని తిరస్కరించారట శ్రీదేవి. ‘ఈ పాత్రకు నేను రైట్ చాయిస్ కాదు’ అని అభిషేక్‌తో ఆమె పేర్కొన్నట్లు బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కథానాయికగా నటించనున్నారు. ‘కై పో చే’లో నటించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ని ఈ చిత్రంలో హీరోగా తీసుకోవాలనుకున్నారట అభిషేక్. అయితే అతని డేట్స్ లేకపోవడంవల్ల ఆయన డైలమాలో పడ్డారని సమాచారం.అటు  హీరో ఇటు విలన్ పాత్రలకు ఆర్టిస్టులు సెట్ అవ్వకపోవడంతో ఈ చిత్రం షూటింగ్‌ని వాయిదా వేసుకున్నారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement