‘మనీ’, ‘అనగనగా ఒకరోజు’ గుర్తొచ్చాయి
‘మనీ’, ‘అనగనగా ఒకరోజు’ గుర్తొచ్చాయి
Published Sat, Oct 19 2013 12:27 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
నలుగురు కుర్రాళ్లు.. ఈజీ మనీ కోసం దోపిడీకి ప్లాన్ చేస్తారు. మరి వారనుకున్నది సాధించారా? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు వారికి ఎదురయ్యాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘డి ఫర్ దోపిడి’. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్ ప్రధాన పాత్రధారులు. సిరాజ్ కల్లా దర్శకుడు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే, నాని నిర్మాతలు. నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ -‘‘సినిమా నచ్చితే ప్రపంచ వ్యాప్తంగా నేనే విడుదల చేస్తానని చెప్పాను. దాంతో నా కోసం ప్రత్యేకంగా నిర్మాతలు షో వేశారు. సినిమా అద్భుతంగా అనిపించింది. రామ్‌గోపాల్‌వర్మ ‘మనీ’, ‘అనగనగా ఒకరోజు’ సినిమాలు గుర్తొచ్చాయి. అందుకే ఈ సినిమాను విడుదల చేస్తున్నా’’ అని తెలిపారు.
‘‘ఇందులోని ప్రతి సన్నివేశాన్నీ ఎంజాయ్ చేస్తాం. కానీ ఆ సన్నివేశాన్ని వివరించి బయట చెప్పలేం. అదీ ఈ సినిమా ప్రత్యేకత’’ అని నాని చెప్పారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయడం పట్ల నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్, సంగీత దర్శకుడు మహేష్‌శంకర్ కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement