
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతి బరిలో ఎఫ్ 2 సినిమాలో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న అనిల్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన దూకుడు, ఆగడు సినిమాలకు పనిచేసిన అనిల్, ఇప్పుడు మహేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత అనిల్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు కూడా మహేష్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment