
దర్శకుడు బీరం మస్తాన్ రావు మృతి
చెన్నై : దర్శకుడు బీరం మస్తాన్ రావు (69) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. హీరో కృష్ణ నటించిన 'బుర్రిపాలెం బుల్లోడు' చిత్రంతో ఆయన దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఆ తరువాత గయ్యాళి గంగమ్మ, ప్రేమ సింహాసనం, తల్లి గోదావరి, విప్లవశంకం, సువర్ణసుందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తక్కువ సినిమాలే తీసినా పరిశ్రమలో బీరం మస్తాన్ రావు తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మృతికి చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.