మామనిధన్‌గా విజయ్‌సేతుపతి | Director Seenuramaswamy will be ready to show Vijayesampathy as Mamnithan. | Sakshi
Sakshi News home page

మామనిధన్‌గా విజయ్‌సేతుపతి

Published Mon, Aug 21 2017 1:18 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

మామనిధన్‌గా విజయ్‌సేతుపతి

మామనిధన్‌గా విజయ్‌సేతుపతి

తమిళసినిమా:  వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్‌ సేతుపతి. ఆయన మాధవన్‌తో కలిసి నటించిన తాజా చిత్రం విక్రంవేదా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా త్రిషతో కలిసి 96 చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్నారు. దర్శకుడు శీనూరామస్వామి, విజయ్‌సేతుపతిలది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. ఇంకా చెప్పాలంటే తెన్‌మేర్కు పరువకాట్రు చిత్రం తో విజయ్‌సేతుపతిని నటుడిగా నిలబెట్టింది దర్శకుడు శీనూరామస్వామి నే.

ఆ తరువాత ఇడమ్‌ పొరుల్‌ ఏవల్‌ చిత్రం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిం ది. ఈ చిత్రం నిర్మాణం పూర్తి అయినా ఇంకా తెరపైకి రాలేదు. ఆ తరువాత ధర్మదురై చిత్రం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విజయ్‌సేతుపతిని మామనిధన్‌గా చూపించడానికి దర్శకుడు శీనూరామస్వామి రెడీ అవుతున్నారు. దీని గురించి కొన్ని నెలల క్రితమే వెల్లడించినా, ఆ తరువాత చిత్రానికి సంబంధించిన సమాచారం ఏమీ రాలేదు.

తాజాగా దర్శకుడు శీనూరామస్వామి మామనిధన్‌ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది దక్షణ తమిళ ప్రాంతంలో నివశించిన ఒక ప్రముఖ వ్యక్తి ఇతివృత్తంగా తెరకెక్కించనున్నట్లు చెప్పారు. ఇది విజయ్‌సేతుపతిని మరో కోణంలో ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను అక్టోబరులో ప్రారంభిం చనున్నట్లు తెలిపారు.ఇందులో కథానాయకి, ఇతర తారా గణం, సాంకేతికవర్గం ఎంపిక ప్ర స్తుతం జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement