
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే నరసింహారెడ్డి లుక్ ఎలా ఉండబోతుందో ఓ హింట్ ఇచ్చారు చిత్ రయూనిట్. తాజాగా ఓ చిన్నారి నరసింహారెడ్డి లుక్ లో దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధృవ సినిమా దగ్గర నుంచి మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మారిన దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడే ఈ చిన్నారి నరసింహారెడ్డి. సైరా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సురేందర్ రెడ్డి తన కొడుకుని ఇలా యోధుడిగా చూసుకొని మురిసిపోతున్నాడట. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న సైరా నరసింహారెడ్డి యూనిట్ ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.