ఆర్యతో విజయ్ మరో చిత్రం | Director Vijay, Arya to team up again | Sakshi
Sakshi News home page

ఆర్యతో విజయ్ మరో చిత్రం

Published Fri, May 16 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

ఆర్యతో విజయ్ మరో చిత్రం

ఆర్యతో విజయ్ మరో చిత్రం

దర్శకుడు విజయ్, నటుడు ఆర్య కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. వీరి కలయికలో ఇంతకుముందు మదరాసుపట్టణం వంటి సంచలన చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఒక చారిత్రక నేపథ్యానికి ప్రేమను మేళవించి తెరకెక్కించిన మదరాసు పట్టణం విశేషకులను సైతం మెప్పించింది. ఈ చిత్రం ద్వారానే లండన్ భామ ఎమిజాక్సన్ కోలీవుడ్‌కు పరిచయమైంది. ఇలాంటి హిట్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుం దంటే ఆ చిత్రం పై మంచి అంచనాలే నెలకొంటాయి. ఈసారి కూడా విజయ్, ఆర్య కలయికలో చారిత్రక కథా చిత్రం ఉంటుందని సమాచారం. అలాగే దర్శకుడు విజయ్ సాంకేతిక వర్గమే ఈ చిత్రానికి పని చేయనున్నారు.
 
 ముఖ్యంగా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, చాయాగ్రాహకుడు నిరవ్‌షాతో మరోసారి విజయ్‌తో కలసి పని చేయనున్నారు. ఆర్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు పూర్తి అయిన తరువాత ఈ చిత్రంలో నటించనున్నారు. అయితే హీరోయిన్ ఇతర తారాగణం గురించి వెల్లడించడానికి ఇంకా చాలా సమయం ఉందంటున్నారు దర్శకుడు విజయ్. ప్రస్తుతం ఆయన తాజా చిత్రం శైవం. నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క అమలాపాల్‌తో ఏడు అడుగులు వేసే కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత తన నూతన చిత్రం వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement