
దిశా పటానీ
దిశా పటానీ బంపర్ ఆఫర్ కొట్టేశారంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ నటించబోయే తదుపరి సినిమాలో దిశా హీరోయిన్‌గా ఎంపిక అవడమే ఇందుకు కారణం అంటున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కాప్: రాధే’ అనే పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీలో నటించనున్నారు సల్మాన్ ఖాన్. వచ్చే ఏడాది ఈద్ పండగ కోసం ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా హాట్ బ్యూటీ దిశా పటానీ ఎంపిక అయ్యారని సమాచారం. సల్మాన్ గత చిత్రం ‘భారత్’లో అతిథి పాత్రలో దిశా మెరిసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈసారి హీరోయిన్‌గా నటించనున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment