'పవన్ను తక్కువ అంచనా వేయొద్దు' | dont underestimate pawan kalyan: ramgopal varma | Sakshi
Sakshi News home page

'పవన్ను తక్కువ అంచనా వేయొద్దు'

Published Sun, Sep 11 2016 3:06 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్ను తక్కువ అంచనా వేయొద్దు' - Sakshi

'పవన్ను తక్కువ అంచనా వేయొద్దు'

నిత్యం వివాదాస్పద ట్వీట్లు చేసే బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ను వెనుకేసుకొచ్చారు. పవన్ ఏ ఒక్కరూ తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. ఆయనను చిన్నచూపు చూసినవాళ్లంతా చెత్త ఆలోచన ఉన్నవాళ్లేనని ఆరోపించారు. పవన్ ఓ మంచి కమాండర్ అవుతారని అన్నారు. మొన్న కాకినాడ సభలో పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడే సందర్భంగా పవన్ అటు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీని లక్ష్యంగా విమర్శలు చేశారు.

ముఖ్యంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లుగా అనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ పై పలువురు కాస్తంత ఘాటుగా స్పందిస్తుండగా రాంగోపాల్ వర్మ మాత్రం భిన్నంగా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిస్థితులపై పవన్ కల్యాణ్కు ఉన్న అవగాహన, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ను గమనిస్తుంటే.. అనుమానమే లేదు.పవన్ కల్యాణ్ కమాండర్లకే కమాండర్ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కమాండర్గా రానున్న పవన్ గురించి డర్టీ మైండ్ ఉన్నవాళ్లే తప్పుగా ఆలోచిస్తారు' అంటూ రాంగోపాల్ వర్మ రెండు ట్వీట్లలో పవన్ భవిష్యత్తు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement