టైమ్‌ ట్రావెల్‌ బ్యూటీ!! | Drew Barrymore Recreated Her Childhood Looks and the Results Are Adorable | Sakshi
Sakshi News home page

టైమ్‌ ట్రావెల్‌ బ్యూటీ!!

Published Mon, Jan 1 2018 12:01 AM | Last Updated on Mon, Jan 1 2018 12:01 AM

Drew Barrymore Recreated Her Childhood Looks and the Results Are Adorable - Sakshi

చిన్నప్పటి ఫోటోలు చూసుకున్నప్పుడు మనకేం అనిపిస్తుంటుంది? ‘అబ్బా భలే క్యూట్‌గా ఉన్నాం’ అనుకుంటాం కదూ! అప్పడుండే క్యూట్‌నెస్‌ వయసొచ్చాక ఎక్కడన్నా ఉంటుందా? అని మళ్లీ మనమే ఆ రోజులను గుర్తు చేసుకొని, ఆ ఫోటోలను చూసుకొని మురిసిపోతుంటాం. డ్రూ బేరిమోర్‌ మాత్రం ఇక్కడే ఆగిపోలేదు. చిన్నప్పుడు ఉన్న క్యూట్‌నెస్‌ను మళ్లీ తిరిగి పొందాలనుకుంది. అప్పుడు దిగినట్లుగానే, క్యూట్‌గా పోజులిచ్చి ఫోటోలు దిగాలనుకుంది. దిగింది కూడా! చిత్రమేంటంటే ఆ అందం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఆ క్యూట్‌నెస్‌ ఇప్పుడింకా అలాగే ఉంది.

ఆ ఫోటోలకు ఇప్పుడు ఫ్యాన్స్‌ అంతా ఫిదా! డ్రూ బేరిమోర్‌ 1980–85 కాలంలో, తనకు 5–10 ఏళ్ల వయసున్న రోజుల్లో దిగిన ఫొటోలు చూసి సంబరపడింది. అలాంటి డ్రెస్సే వేసుకొని, అలాగే ఇప్పుడు ఫోటో దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆమె తన కొత్త ఫోటోషూట్‌కు రంగం సిద్ధం చేసుకొంది. 42 ఏళ్ల డ్రూ.. 32 ఏళ్లు వెనక్కి వెళ్లి పదేళ్ల నాటి తన ఫోటోలు చూసుకుంటూ అలాంటి పోజులతోనే క్యూట్‌ క్యూట్‌ ఫోటోలు విడుదల చేసింది. కాలంలో ఎన్నేళ్లు వెనక్కి వెళ్లినా, ఈ బ్యూటీ బ్యూటీయే కదూ!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement