'ఇంకెంతమాత్రం హాట్‌గా ఉండలేను' | To be hot in Hollywood is 'exhausting,' says Drew Barrymore | Sakshi
Sakshi News home page

'ఇంకెంతమాత్రం హాట్‌గా ఉండలేను'

Published Sun, Feb 7 2016 7:13 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

'ఇంకెంతమాత్రం హాట్‌గా ఉండలేను'

'ఇంకెంతమాత్రం హాట్‌గా ఉండలేను'

చైల్డ్ స్టార్ నుంచి హాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన డ్రూ బ్యారిమోర్.. తాను ఇంకెంతమాత్రం 'హాట్‌', 'హాట్‌'గా కనిపించలేను అంటోంది. ఎన్నో చిత్రాల్లో తన అందాలతో అభిమానుల మతులు పోగొట్టిన ఈ 40 ఏళ్ల ప్రౌఢ సుందరి తాజాగా హార్పర్స్ 'బజార్' మ్యాగజీన్‌లో 'హాట్‌ లుక్‌'తో దర్శనమిచ్చింది. అయితే ఎల్లప్పుడూ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగడం కష్టమని, కాలంతోపాటు సాగుతూ వైవిధ్యం కనబర్చాలని అంటోంది ఈ అమ్మడు.

'హాట్‌గా ఉండటం అనేది ఒక మనోస్థితి. అది ఒక ఉత్సాహం. ఒక ప్రేరణ వల్ల మీరు హాట్‌గా కనిపిస్తారు. అంతేకానీ హాట్‌గా ఉండటమంటే టాప్ లో ఒకరిగా ఉండటమో, అందమైన శరీరాన్ని కలిగి ఉండటమో కాదు. ఇంకా చెప్పాలంటే ఒక ఆరాధనతో దహించుకుపోయేవాళ్లే హాట్‌గా కనిపిస్తారు' అని బ్యారిమోర్ పేర్కొంది. 'ద చార్లీస్ ఎంజెల్స్‌', 'ఈటీ-ఎక్స్టా టెరెస్ట్రియల్‌' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న వ్యాపారాలతో సంతోషంగా ఉన్నానని చెప్తోంది. కీర్తి ప్రతిష్టలు అన్నవి తాత్కాలికం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement