దెయ్యంలా కనిపిస్తున్నా! | Drew Barrymore genius hack to get rid of red skin | Sakshi
Sakshi News home page

దెయ్యంలా కనిపిస్తున్నా!

Published Sun, May 27 2018 2:35 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Drew Barrymore genius hack to get rid of red skin - Sakshi

వయసు మీద పడిపోతుంటే అందం తగ్గిపోతుంది. కొందరు హ్యాపీ పర్సన్స్‌ ఉంటారు. వాళ్లలా హ్యాపీగా ఉండటమే గొప్ప అందం. కానీ పిల్లలు, కెరీర్, ఇల్లు, గోల.. అందాన్ని మింగేస్తాయి. డ్రూ బ్యారీమోర్‌.. ప్రపంచం మెచ్చిన అందగత్తె. హాలీవుడ్‌లో పాపులర్‌ స్టార్‌. నలభైల్లో ఉన్నా కూడా ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. అలాంటి అంతగత్తె కూడా నలభైల్లోకి వచ్చాక ఆడవాళ్లకు అందం విషయంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటోంది. అలాగే వాటినుంచి ఎలా బయటపడాలో కూడా ఆమే చెప్తోంది. ‘‘నాకు కళ్లకింద డార్క్‌ సర్కిల్స్‌ వస్తాయి. అవంటే నాకు పిచ్చి భయం. నేనేదో డిప్రెషన్‌లో ఉన్నట్టు చూపిస్తాయి ఆ సర్కిల్స్‌.

కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానని ప్రపంచానికి ఎలా చెప్పడం? ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మామూలుగా, డార్క్‌ సర్కిల్స్‌ కోసం వైట్‌ కలర్‌ క్రీమ్స్‌ వాడుతూంటారు. కానీ అదస్సలు బాగోదు. మీ స్కిన్‌టోన్‌ కలర్‌కు దగ్గరగా ఉండే కలర్స్‌ వాడుతూ ఉండాలి. నేనదే చేస్తా. డార్క్‌ సర్కిల్స్‌ పోగొట్టుకుంటే కేవలం అందాన్ని కాపాడుకున్నట్టు కాదు, మనం హ్యాపీగా ఉన్నామని ప్రపంచానికి చెప్పినట్టు కూడా! నేనైతే డార్క్‌ సర్కిల్స్‌తో శ్మశానం నుంచి లేచొచ్చిన దెయ్యంలా కనిపిస్తున్నా!’’ అని నవ్వుతూ చెప్తూ, సలహాలిచ్చేస్తోంది డ్రూ బ్యారీమోర్‌. ఆమె బ్యూటీ టిప్స్‌కు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్‌ ఉంది. ఆమె అందం ఫార్ములా తెలిసింది కదూ! అయితే అందం.. ముందు హ్యాపీగా ఉంటేనే సుమా!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement