వయసు ప్రభావం! | e age lantidi movie shooting Started | Sakshi
Sakshi News home page

వయసు ప్రభావం!

Published Sat, Oct 11 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

వయసు ప్రభావం!

వయసు ప్రభావం!

 ‘ఈ వయసు అలాంటిది...’ అనే మాట ప్రతి ఒక్కరూ తమ టీనేజ్‌లో వినడం సహజం. ఆ వయసులో ఉండే దూకుడు, పెంకితనం, పెద్దవాళ్ల మాటలను ఖాతరు చేయకపోవడం.. ఇలాంటివన్నీ చూసి, అంతా వయసు ప్రభావం అనేస్తారు. ఆ వయసు ప్రభావం ఎలా ఉంటుంది? అనేది ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని జి. విజయకుమార్ గౌడ్ నిర్మిస్తున్న ‘ఈ ఏజ్ అలాంటిది’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ప్రముఖ దర్శకుడు కె. భాగ్యరాజా శిష్యుడు విజయప్రకాశ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హృషీకేశ్, త్రిదేవ్, కార్తీక్, స్వప్న, లుబ్న, నాగవల్లి ఇందులో హీరో, హీరోయిన్లు. ఇందులో మొత్తం నాలుగు పాటలుంటాయని, ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, 40 రోజుల పాటు ఏకధాటిగా జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్ శివ సుబ్రహ్మణ్యం, కెమెరా: ముజీర్ మాలిక్, సహనిర్మాత: బాలాజీ శ్రీను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement