
అందాలారబోతలో తప్పేంలేదు అంటోంది నటి ఈశా రెబా. టాలీవుడ్‌లో అవకాశాలను అందుకుంటున్న ఈ హైదరాబాదీ బ్యూటీ కోలీవుడ్‌లో పాగా వేయాలని ఆశ పడుతోంది. తెలుగులో అంతకుముందు ఆ త రువాత చిత్రం ద్వారా కథానాయయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంతో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఇంకా స్టార్ హీరోల సరసన న టించే అవకాశాలను పొందలేదు. ఈ అమ్మడు నటించిన తెలుగు చిత్రం రాగల 24 గంటల్లో శుక్రవారం తెరపైకి రానుంది. ఇప్పటికే ఓయి అనే చిత్రంతో తమిళ సినీరంగంలోకి దిగుమతి అయినా, పెద్దగా గుర్తింపు పొందలేదు. ప్రస్తుతం జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఆయిరం జన్మంగళ్ అనే చిత్రంలో నటించింది. ఎళిల్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 20 తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా దీనిపై ఈశా రెబా చాలా ఆశలు పెట్టుకుంది. అంతకుముందే తన గ్లామర్‌తో రచ్చ చేసి కోలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో పడినట్లుంది.
అందుకు సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. హాట్‌హాట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. ఏమిటమ్మా అందాలారబోత అని అడిగితే తప్పేముందీ అని ఎదురు ప్రశ్నిస్తోంది. దీని గురించి ఈశా రెబా స్పందిస్తూ ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదని, తెలుగు నటీమ ణులు ఇలానే నటిస్తారని సినీ వర్గాలు భావిస్తారని, అలాంటి ముద్రను తుడిచేసి తాను ఏ తరహా పాత్రనైనా చేయగల నని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. గ్లామరస్ ఫొటోలను విడుదల చేయడంలో తప్పేంటీ? అని ప్రశ్నిస్తోంది. తాను అందగత్తెనని, అందాలారబోత ఫొటోలను విడుదల చేయడంలో తప్పేమీ లేదని అంది. హద్దులు మీరని గ్లామరస్ దుస్తులు ధరించడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని, ఏదైనా చూసేవారి దృష్టిని బట్టే ఉంటుందని అంది.
Comments
Please login to add a commentAdd a comment