ప్రేమికుల హృదయాల్లో స్థానం
ప్రేమికుల హృదయాల్లో స్థానం
Published Thu, Nov 14 2013 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
‘‘నేను దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ప్రేమికుల హృదయాల్లో కచ్చితంగా ఈ చిత్రానికి స్థానం దక్కుతుంది. అంత కంటెంట్ ఈ సినిమాలో ఉంది’’ అని దర్శకుడు ఎస్.ఐ.మహేంద్ర చెప్పారు. అజయ్ మంతెన, జియానా జంటగా గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ‘ఎంత అందంగా ఉన్నావె’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడుతూ -‘‘నేను గతంలో ‘మంగళ’ తీశాను. ఈ
సినిమాలో ప్రేమ, వినోదం అన్నీ ఉన్నాయి’’ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని అజయ్ మంతెన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సహనిర్మాతలు అశోక్ సోని, మహమ్మద్ రఫీ, మనోజ్ మాట్లాడారు.
Advertisement
Advertisement