Entha Andanga Unnave
-
ప్రేమికుల హృదయాల్లో స్థానం
‘‘నేను దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ప్రేమికుల హృదయాల్లో కచ్చితంగా ఈ చిత్రానికి స్థానం దక్కుతుంది. అంత కంటెంట్ ఈ సినిమాలో ఉంది’’ అని దర్శకుడు ఎస్.ఐ.మహేంద్ర చెప్పారు. అజయ్ మంతెన, జియానా జంటగా గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ‘ఎంత అందంగా ఉన్నావె’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో నిర్మాత మాట్లాడుతూ -‘‘నేను గతంలో ‘మంగళ’ తీశాను. ఈ సినిమాలో ప్రేమ, వినోదం అన్నీ ఉన్నాయి’’ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని అజయ్ మంతెన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సహనిర్మాతలు అశోక్ సోని, మహమ్మద్ రఫీ, మనోజ్ మాట్లాడారు. -
అపార్ట్మెంట్లో ప్రేమకథ!
అదో అందమైన అపార్ట్మెంట్. అందులో నివసించేవాళ్లకి కలుపుగోలుతనమూ ఎక్కువే. కలహానికి కాలు దువ్వడమూ ఎక్కువే. అయితే ఆ ఇద్దరికీ మాత్రం ఇవేం పట్టవు. అందరి కళ్లనూ తప్పించుకుని, ప్రేమ ఊసులు చెప్పుకోవడానికి తహతహలాడుతుంటారు. ఈ జంట ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది? ఆ ప్రేమకు శుభం కార్డు పడుతుందా? తదితర అంశాలతో రూపొందిన చిత్రం ‘ఎంత అందంగా ఉన్నావె’. ‘నువ్విలా’ ఫేమ్ అజయ్ మంతెన, జియానా జంటగా ఎస్.ఐ.మహేంద్ర దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ఓ అపార్ట్మెంట్లో ఓ యువతీ యువకుడి మధ్య పుట్టిన ప్రేమకథతో ఈ సినిమా తీశాం. కచ్చితంగా యువతరాన్ని, కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. దర్శకుడు ఎస్.ఐ. మహేంద్ర మాట్లాడుతూ -‘‘సిరివెన్నెల సాహిత్యం, యోగీశ్వర శర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్. అల్లర్లు, అలకలు, తమాషాలు, భావోద్వేగాలతో సినిమా సరదా సరదాగా సాగిపోతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అశోక్ సోని, మహ్మద్ రఫీ, సమర్పణ: తమ్మిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి. -
'ఎంత అందంగా ఉన్నావె' పోస్టర్స్
ఓ అపార్ట్ మెంట్ లో చిగురించిన ప్రేమ నేపథ్యంలో ఎంత అందంగా ఉన్నావే చిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఐ మహేంద్ర. యోగీశ్వర శర్మ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అదనపు ఆకర్షణ. వినోదంతోపాటు భావోద్వేగాలు, చిలిపి సంఘటనలతో ఈ చిత్రం సరదాగా సాగిపోతుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.