3న తెరపైకి లోగన్ | Every Image So Far From Hugh Jackman's Final Wolverine Movie | Sakshi
Sakshi News home page

3న తెరపైకి లోగన్

Published Mon, Feb 13 2017 2:16 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

3న తెరపైకి లోగన్ - Sakshi

3న తెరపైకి లోగన్

బ్రహ్మాండమైన యాక్షన్  థ్రిల్లర్‌ కథా చిత్రంగా తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం లోగన్ ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాన సంస్థ ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రానికి జేమ్స్‌మ్యాన్  గోల్డ్‌ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు దివాల్వేరిన్  వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. హగ్‌ జాక్‌మ్యాన్  కథానాయకుడిగా నటించారు. చిత్ర వివరాలను ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్వాహకులు లోగన్  చిత్ర వివరాలను తెలుపుతూ కామిక్‌ కథా చిత్రాల్లో బాగా పాపులర్‌ అయిన పాత్ర వాల్వేరిన్, ఆ పాత్ర ప్రధానంగా తెరకెక్కిన తాజా చిత్రం లోగన్  అని తెలిపారు.

హగ్‌ జాక్‌మ్యాన్  వాల్వేరిన్ పాత్రలో నటించడం ఇది పదోసారి అని పేర్కొన్నారు. ఆయన ఇంతకు ముందు అతీంద్రీయ శక్తిదే పై చెయ్యిగా కలిగిన పాత్రల్లో నటించారని, ఇందులో మానవశక్తి మెండేనని చెప్పే పాత్రలో కనిపించనున్నారని తెలిపారు.లోగన్ త్రం 2029లో జరిగే కథగా సాగుతుందన్నారు. తన శక్తులను పక్కన పెట్టి ఒక బండి లాగుకుంటూ జీవనం గడపే హీరోకు మళ్లీ తన వక్తులను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. తన లాంటి శక్తులున్న ఒక యువతిని రక్షించాల్సిన బాధ్యత కలగడంతో ఆమెను ఎలా కాపాడాడు?అన్న పలు అబ్బురపరిచే సన్నివేశాలతో రూపొందిన చిత్రం లోగన్  అని తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చి మూడో తేదీన తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement