ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ!
‘7/జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘యుగానికొక్కడు’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రాఘవ అందించిన కథతో రూపొందిన చిత్రం ‘నన్ను వదలి నీవు పోలేవులే’. ఆయన సతీమణి గీతాంజలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కోలా బాలకృష్ణ హీరోగా ఆయన తండ్రి కోలా భాస్కర్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. వామిక కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ -‘‘అంద మైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రానికి క్లయిమ్యాక్స్ హైలైట్‌గా నిలుస్తుంది. త్వరలో పాటలను, ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘తెలుగు తెరపై ఇలాంటి కథాంశంతో ఏ సినిమా రాలేదు. వైవిధ్యమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని సమర్పకులు కంచర్ల పార్ధసారధి తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీరాఘవ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మణికుమార్.