
ఫెఫ్సీ కొత్త లోగో ఆవిష్కరణ
చెన్నై : దక్షిణ భారత సినీ కార్మిక సంఘం సోమవారం కొత్త లోగో ఆవిష్కరించింది. దక్షిణాదిలోని వివిధ భాషల 24 శాఖల సినీ పరిశ్రమలు ఫెఫ్సీగా చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి అన్ని సంఘాలకు ఫెఫ్సీ కార్యాలయం నుంచి కార్యనిర్వహణ జరుగుతుంటుంది. నిర్మాతలు, దర్శకులు, కార్మికులు ఎవరైనా తమ సమస్యలను ఇక్కడే పరిష్కరించుకుంటారు. అటువంటి ఫెఫ్సీ సంఘానికి కొత్త లోగోను ఆవిష్కరించారు.
కార్మికుల కష్టాలను, జరుగుతున్న నష్టాలను ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకువెళ్లే దిశలో కొత్తగా ఆవిష్కరించిన ఫెఫ్సీ లోగోను కూడా అందరికీ పరిచయం చేసినట్లు సంఘం అధ్యక్షుడు అమీర్ సుల్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కె సెల్వమణి, విక్రమన్, ఎన్.లింగుస్వామి, ఎస్ఏ రాజ్కుమార్, వి.శేఖర్, రవి కె.చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.