మచ్చలు పడతాయేమో.. చూపిస్తా: షారుక్ | few scars maybe, says shah rukh khan after injury | Sakshi
Sakshi News home page

మచ్చలు పడతాయేమో.. చూపిస్తా: షారుక్

Published Fri, Jan 24 2014 12:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

షారుక్ ఖాన్ - Sakshi

షారుక్ ఖాన్

ఫరాఖాన్ తీస్తున్న 'హేపీ న్యూ ఇయర్' సినిమా షూటింగులో గాయపడిన బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్.. తాను ఇంకా కొన్ని వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి ఉందని తెలిపాడు. షూటింగులో గాయపడిన వెంటనే షారుక్ ఖాన్ను నానావతి ఆస్పత్రికి తరలించి, అక్కడ చికిత్స చేయించిన విషయం తెలిసిందే. నుదుటిమీద చిన్న గాయం మాత్రమే అయ్యిందని, ఆయన బాగానే ఉన్నారని షారుక్ వ్యక్తిగత సిబ్బంది నిన్న తెలిపారు. అయితే.. షారుక్ గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా తన పరిస్థితిని తెలిపాడు.

త్వరలోనే అతా బాగుంటుందని ఆశిస్తున్నానని, మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, ఇన్షా అల్లా.. అంతా బాగానే ఉంటుందని అన్నాడు. అయితే, కొన్ని మచ్చలు పడొచ్చని, సంతోషానికి మచ్చలు ఉండవు కాబట్టి, వాటిని తాను అందరికీ చూపిస్తానని అన్నాడు. షూటింగులో ఉండగా ఓ బలమైన తలుపు తగలడం వల్లే షారుక్ గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను డాక్టర్ బాలాభాయ్ నానావతి ఆస్పత్రికి తరలించారు. రెండు గంటలకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన షారుక్ ఖాన్.. వెంటనే షూటింగులో కూడా పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement