అఖిల్
అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన ఈ చిత్రంలోని మొదటి పాటని మార్చి 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు, వాసు వర్మ మాట్లాడుతూ –‘‘ఇటీవల విడుదల చేసిన అఖిల్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్స్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ముఖ్య తారాగణంతో పాటు అఖిల్, పూజా హెగ్డే ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి పాట మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ చైర్ కొట్టేస్తున్నాయి. ఇదే తరహాలో మార్చి 2న విడుదల కానున్న మా సినిమా తొలి పాట కూడా ఆడియన్స్ విష్ లిస్ట్‌లో మొదటిస్థానంలో నిలుస్తుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment