
శ్వేత, అనురాగ్
క్రిషి క్రియేషన్స్ పతాకంపై హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. అనురాగ్ కొణిదెన కథానాయకునిగా, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ కథానాయికలుగా నటించారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ– ‘‘స్వేచ్ఛ లేని జీవితం అంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు సమరంలో ఒక సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది’’ అన్నారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుని లాంటిది. మా సినిమా కూడా చూసినవాళ్లందరికీ మంచి ఫ్రెండ్ అవుతుంది. త్వరలో ఆడియోను, జూన్ ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి సతీష్ పాలకుర్తి.
Comments
Please login to add a commentAdd a comment