ప్రముఖ నటుడు కన్నుమూత | Girish Karnad Passed Away On | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత

Published Mon, Jun 10 2019 9:57 AM | Last Updated on Mon, Jun 10 2019 2:20 PM

Girish Karnad Passed Away On - Sakshi

సాక్షి, బెంగళూరు : ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్‌ కర్నాడ్‌.. సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రంగస్థల నటుడిగా, రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్దిగాంచిన ఆయన.. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, ధర్మచక్రం, రక్షకుడు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు.

1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాలో జన్మించిన కర్నాడ్‌ సినిమాల్లో నటిస్తూనే.. పలు రచనలు చేసి 1998లో జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్నారు. తుఝ, తలిదండ ఆయన కన్నడ ప్రముఖ రచనలు కాగా.. వంశవృక్ష అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement