మేకకు షారూఖ్ పేరు | Goat named Shah Rukh in Janaki Vishwanathan debut Hindi film 'Bakrapur' | Sakshi
Sakshi News home page

మేకకు షారూఖ్ పేరు

Published Thu, Sep 19 2013 12:14 PM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

మేకకు షారూఖ్ పేరు

మేకకు షారూఖ్ పేరు

జాతీయ అవార్డు గ్రహీత జానకీ విశ్వనాథన్ తొలిసారిగా హిందీలో తెరకెక్కిస్తున్న 'బక్రాపూర్' సినిమాలో ఓ మేకకు షారూఖ్ పెట్టారు. షారూఖ్ పేరు వినగానే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గర్తుకు వస్తారు. కథకు అనుగుణంగానే తన సినిమాలో మేకకు షారూఖ్ పేరు పెట్టానని జానకీ విశ్వనాథన్ పీటీఐతో చెప్పారు. ఈ సినిమాలో కీలకమైన మేక పాత్రకు క్యాచీ టైటిల్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టినట్టు వివరించారు. తాను కేవలం షారూఖ్ అని మాత్రమే పేరు పెట్టానని స్పష్టం చేశారు.

షారూఖ్ ఖాన్ అంటే తనకెంతో గౌరవమని చెప్పారు. అయితే ఆయనను తానెప్పడు కలవలేదని తెలిపారు. షారూఖ్ ఖాన్కు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ఆయనను ఇంటర్య్వూలు చూసి తెలుసుకన్నానని అన్నారు. గ్రామీణ భారతం నేపథ్యంలో సోషియో-పొలిటికల్ సైటర్గా 'బక్రాపూర్' తెరక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించడంతో పాటు ఆమె దర్శకత్వం వహిస్తున్నారు. జానకీ విశ్వనాథన్ అంతకుముందు నాలుగు సినిమాలు తీశారు. ఇందులో మూడు తమిళ సినిమాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement