కమల్ నాస్తికుడు... మోహన్‌లాల్ కృష్ణుడు!
కొత్తగా చెప్పేదేముంది? పలు సందర్భాల్లో కమల్‌హాసనే స్వయంగా ‘నేను నాస్తికుణ్ణి’ అని వెల్లడించారు. ఇప్పుడు తెరపై అటువంటి పాత్రలోనే నటించడానికి సిద్ధమవుతున్నారట. అక్షయ్‌కుమార్ కృష్ణుడిగా, పరేశ్ రావెల్ నాస్తికుడిగా నటించిన హిందీ సినిమా ‘ఓ మై గాడ్’. దీన్నే తెలుగులో ‘గోపాల గోపాల’గా రీమేక్ చేశారు.
ఈ సినిమాను తమిళ, మలయాళ భాషల్లో కమల్‌హాసన్ రీమేక్ చేయాలనుకుంటున్నారట. కృష్ణుడి పాత్రకు మోహన్‌లాల్‌ను సంప్రదించారట. కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ సంస్థ తమిళ, మలయాళ రీమేక్‌ను నిర్మించçనుందని సమాచారం. మరి, ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా తెలియలేదు. మోహన్‌లాల్ అంగీకరిస్తే వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌కి పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట.