పక్కా గుంటూరు అమ్మాయిలా...
‘‘కంచె, ఓం నమో వేంకటేశాయ’ చిత్రాల్లో నేను చేసినవి హిస్టారికల్ రోల్స్. కానీ, ‘గుంటూరోడు’లో మాత్రం పక్కా గుంటూరు అమ్మాయిలా కనిపిస్తా. ఈ పాత్ర నా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉంటుంది’’ అని ప్రగ్యా జైశ్వాల్ అన్నారు. మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా అట్లూరి బాలప్రసాద్ సమర్పణలో ఎస్.కె. సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ మార్చి 3న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రగ్యా చెప్పిన విశేషాలు...
♦ దర్శకుడు ఈ చిత్రకథ, నా పాత్ర చెప్పగానే వదులుకోకూడదనుకున్నాను. నా పాత్ర చాలా స్వీట్‌గా ఉంటుంది. మనోజ్ గురించి చెప్పాలంటే.. వెరీ ఫ్రెండ్లీ అండ్ ఎనర్జిటిక్. ఈ చిత్రంలో మంచి మాస్ లుక్‌తో కనిపిస్తాడు. అతడితో నా లవ్ ట్రాక్ నడుస్తుంటుంది. మాస్ కుర్రాడికి లవ్వా? అనుకోవద్దు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
♦ ఈ సినిమా సమాజానికి దగ్గరగా ఉంటుంది. సత్య చెప్పిన పాయింట్, సీన్స్‌కి సొసైటీలో ఎక్కడో చోట కనెక్షన్ ఉంటుంది. అందుకే ప్రేక్షకులు కూడా సినిమాలో లీనమైపోతారు. ‘గుంటూరోడు’ కోసం వరుసగా ఆరు నెలలు హైదరాబాద్‌లోనే ఉన్నా. ఇక్కడి ప్రజలు నిజాయితీగా ఉంటారు. అందుకే నాకు హైదరాబాద్ సిటీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్‌ను నా సెకండ్ హోమ్‌లా భావిస్తా.
♦ ‘నక్షత్రం’ చిత్రంలో పోలీస్ పాత్ర చేశా. సీరియస్‌గా, సరదాగా ఉండే పాత్ర అది. కృష్ణవంశీగారితో సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్.