మనోజ్ సినిమాకు వెరైటీ టైటిల్ | Manchu manoj next film title gunturodu | Sakshi
Sakshi News home page

మనోజ్ సినిమాకు వెరైటీ టైటిల్

Published Fri, Sep 30 2016 2:51 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

మనోజ్ సినిమాకు వెరైటీ టైటిల్ - Sakshi

మనోజ్ సినిమాకు వెరైటీ టైటిల్

చాలా రోజులుగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు పేరుతో నక్సలైట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు అజయ్ ఆండ్రూస్ దర్శకుడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు.

నా రాకుమారుడు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సత్య దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు మనోజ్. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గుంటూరోడు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు మనోజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement