
శశి దర్శకత్వంలో జీవీ
శశి దర్శకత్వంలో నటించడానికి జీవీ ప్రకాశ్‌కుమార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. రోజాకూట్టం, సోల్లామలై, డిష్యుం, పూ తదితర వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు శశి. కొంత కాలంగా సరైన హిట్‌లు లేక కాస్త వెనుక పడ్డ ఈ దర్శకుడిని పిచ్చైక్కారన్ విజయం మళ్లీ ప్రైమ్ టైమ్‌లో నిలబెట్టింది. దీంతో పునరుత్తేజం పొందిన శశి తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.
ఈ సారి తన కథకు యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇటీవల ఆయన్ని కలిసి కథ వినిపించడం, అందులో నటించడానికి జీవీ పచ్చజెండా ఊపడం జరిగి పోయినట్లు సమాచారం. శశి దర్శకత్వంలో నటించడానికి కాల్‌షీట్స్ సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. ఆయన కాల్‌షీట్స్ కేటాయించడమే ఆలస్యం చిత్రం ప్రారంభం అవుతుందని సమాచారం.
ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో కూడిన కథా చిత్రంగా ఉంటుందట. జీవీ ప్రకాశ్‌కుమార్ ప్రస్తుతం బ్రూస్‌లీ చిత్రంతో పాటు రాజేశ్ దర్శకత్వంలో కడవుల్ ఇరుక్కిరాన్ కుమారు చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం, రాజీవ్‌మీనన్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇవన్నీ పూర్తి చేసిన తరువాతనే శశి చిత్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.