హవా హవాయిలో ‘జీవించా’!
హవా హవాయిలో ‘జీవించా’!
Published Wed, Apr 2 2014 11:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
అమోల్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న ‘హవా హవాయి’ చిత్రంలో తాను చాలా పరిణతి చెందిన కోచ్ పాత్ర పోషిస్తున్నానని బాలీవుడ్ నటుడు సాఖిబ్ సలీమ్ అన్నాడు. ఇతడు ఇంతకు ముందు ‘ముజ్సే ఫ్రెండ్‌షిప్ కరోగీ, మేరే డాడ్ కి మారుతి’ వంటి సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. సాఖిబ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చేయడం అదృష్టంగా చెప్పాడు. తను శిక్షణ పొందిన నటుడు కాకపోయినా డెరైక్టర్లు తనకు నటించడానికి అవకాశముండే పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో తాను స్కేటింగ్ కోచ్ పాత్ర చేస్తున్నానని తెలిపాడు.
ఈ కోచ్ పిల్లలతో సీరియస్‌గా ఉండడని చెప్పాడు. తన వద్ద శిక్షణ తీసుకుంటున్న చిన్నారులతో స్నేహంగా ఉండే ఈ పాత్రను చిన్నారులు ప్రేమిస్తారని చెప్పాడు. కాగా, ఈ పాత్ర కోసం తాను నిజజీవితంలో స్కేటింగ్ కోచ్‌లైన ఇద్దరిని కలిసి వారివద్ద కొంత అవగాహన పొందానని చెప్పాడు. ఈ సినిమాలో తనతోపాటు డెరైక్టర్ అమోల్ కుమారుడు పార్థో కూడా నటిస్తున్నాడని తెలిపాడు. ఇంతకుముందు ‘స్టాన్లీ కా డబ్బా’లో తన నటనకు గాను పార్థో జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇండియాలోనే ఉత్తమ బాలనటుల్లో పార్థో ఒకడని సాఖిబ్ అతడిని పొగడ్తల్లో ముంచెత్తేశాడు. కలలు కనే ధైర్యం ఉండే ప్రతి ఒక్కరికి ‘హవా హవాయి’ సినిమాను అంకితమిస్తున్నామన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ స్థాయిలో ఉన్న ఈ సినిమా మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. మొదట్లో చిన్న పిల్లలతో సినిమా అనేసరికి తనకు చాలా భయమేసిందని, వారు తనను అభిమానిస్తారో లేదోనని కొంచెం కలవరపడ్డానని సాఖిబ్ తెలిపాడు. తనది పిల్లలతో స్నేహంగా ఉండే కోచ్ పాత్ర కాబట్టి సినిమా షూటింగ్ ప్రారంభంలో వారం రోజుల పాటు పిల్లలతోనే ఎక్కువగా గడిపేందుకు కేటాయించానన్నాడు. తద్వారా వారితో తనకు చనువు పెరిగి.. సినిమా బాగా వచ్చేందుకు దోహదపడుతుందని ఆలోచించానన్నాడు.
Advertisement
Advertisement