బిగ్ బాస్: హరితేజ టాలెంట్ అదుర్స్! | Hari Teja asking voting for bigg boss video goes viral | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్: హరితేజ టాలెంట్ అదుర్స్!

Published Sun, Sep 24 2017 9:07 AM | Last Updated on Sun, Sep 24 2017 3:25 PM

Hari Teja asking voting for bigg boss video goes viral

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అతిపెద్ద తెలుగు రియాల్టీ షో 'బిగ్ బాస్'. మరికొన్ని గంటల్లో సీజన్ 1 విజేత ఎవరో తేలనుంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లు విజేతగా నిలవాలంటే వారికి ప్రేక్షకుల మద్దతు అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని యాంకర్, నటి హరితేజ చాలా తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ తాను ఫైనల్స్‌కు వెళితే స్వయంగా తానే ప్రేక్షకులను తనకు ఓటేసి గెలిపించాలని కోరాలని భావించారు. ఇందులో భాగంగానే తన క్లోజ్ ఫ్రెండ్ వింధ్యా విశాఖ సాయంతో షోకి వెళ్లకుముందే ఓ వీడియో తీశారు. ఫైనల్స్ నేపథ్యంలో వింధ్యా ఆ వీడియోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు హరితేజతో పాటు శివ బాలాజీ, ఆదర్శ్, నవదీప్, అర్చన కూడా సీజన్ 1 ఫైనల్స్‌ చేరుకుని టైటిల్‌ పోరులో ఉన్నారు. అయితే దాదాపు 70 రోజుల కిందటే బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ ముందుచూపుతో ఆలోచించి వీడియో తీసుకున్నారు. తనకు మద్దుతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హరితేజ తనకు ఓటింగ్ చేయాలంటూ వీడియో ద్వారా విజ్ఞప్తిచేశారు. స్నేహితురాలు టైటిల్ నెగ్గాలని ఆశిస్తూ యాంకర్ వింధ్యా ఆ వీడియోను ఇటీవల పోస్ట్ చేయగా.. హరితేజ ప్రయత్నాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'బిగ్ బాస్ తెలుగు ఓట్' అని సెర్చ్‌చేస్తే అధికారిక ఓటింగ్ సైట్ వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement