vindhya
-
అక్కడ అందరి ముందే దుస్తులు మార్చుకోవాలి: యాంకర్ వింధ్య
ఇది ఐపీఎల్ సీజన్. తెలుగులో ఓ అమ్మాయి చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబై అమ్మాయో అనుకునేటట్లు ఉంది. ఆ అమ్మాయి పేరు 'వింధ్య విశాఖ' మేడపాటి. 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి. ఐపీఎల్ సీజన్-11 నుంచి హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను ఆమె ఆకర్షిస్తోంది. తాజాగా తన మోడలింగ్ రోజుల గురించి పలు విషయాలను ఆమె పంచుకుంది. ఎక్కువగా మగవారు మాత్రమే ఉన్న క్రికెట్ రంగంలో కుటుంబసభ్యుల ప్రోత్సహం వల్లే తాను కెరీర్లో రాణించగలుగుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వింధ్య తెలిపారు. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేయకూడదని తన అమ్మగారి షరతు పెట్టడంతో ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు మోడలింగ్‌లోనూ శిక్షణ పొందానని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 63 ఏళ్ల టాప్ హీరోతో సినిమా.. నో చెప్పిన మీనా) అలా కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో పాల్గొన్న వింధ్య విన్నర్‌గా కూడా రాణించినట్లు తెలిపింది. దీంతో ఎలాగైనా మోడలింగ్ చేయాలనే ఆలోచన రావడంతో చదువు పూర్తి అయన తర్వాత మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నట్లు ఆమె అన్నారు. 'సుమారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ వీక్‌లో నేను పాల్గొన్నాను. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షో గా నా కెరియర్లో మిగిలిపోయింది. అక్కడి వాతావరణం చూసిన తర్వాత ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్ షో కోసం వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకోవడానికీ సరైన గదులు కూడా లేవు. బ్యాక్ స్టేజ్ వద్ద అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి కొంత సమయం పాటు షాకయ్యా. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నా ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదనిపించింది. ఆ ఒక్క షో వల్ల మోడలింగ్‌ను వదిలేశాను. ఇది నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే చెప్పుతున్నాను. అన్ని చోట్లా ఇలాగే ఉంటుందనేది నా అభిప్రాయం కాదు.'అని వింధ్య తెలిపారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. గోపాల గోపాల, ముకుందా వంటి చిత్రాల్లో కూడా తనకు అవకాశం వచ్చినట్లు వింధ్య చెప్పారు. కానీ తనకు సినిమా రంగం అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆ చిత్రాలకు నో చెప్పినట్లు ఆమె అన్నారు. -
పర్వత పుత్రికలు: శశి, గునిత్, అనుష.. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు సైతం
హిమాలయాలు... వింధ్య పర్వతాలు... వీటిని చూడాలని ఎవరికి ఉండదు? రాబోయే వేసవి సెలవుల్లో పర్వత సౌందర్యం చూడాలని చాలామంది అనుకుంటారు. కాని ఆరోగ్య, వయసు సమస్యలు, దివ్యాంగ పరిమితులు కొందరిని భయపెట్టవచ్చు. అయితే ఎవరికైనా సరే పర్వతాలను దగ్గరుండి చూపిస్తాం అంటున్నారు ముగ్గురు మహిళా ట్రెక్ గైడ్లు – శశి, గునిత్, అనుష. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ వీరు అపరేట్ చేస్తున్న ట్రెక్ టూర్లు అద్భుత పర్వత దర్శనం చేయిస్తున్నాయి. ‘కలగను.. కనుగొను’ అనే ట్యాగ్‌లైన్ ఉంటుంది అనుష, శశి, గునీత్ నడిపే ‘బొహెమియన్ అడ్వంచర్స్’ అనే ట్రెకింగ్ ఏజెన్సీకి. లోకాన్ని చూసి రావాలన్న కలను నెరవేర్చుకోవడానికి దారిని కనుగొనమని, ఆ దారి కనుగొనడంలో తాము సాయం చేస్తామని అంటారు వీరు ముగ్గురు. మన దేశంలో పూర్తిగా స్త్రీలు మాత్రమే నడుపుతున్న ట్రెకింగ్ ఏజెన్సీలలో వీరిది ఒకటి. అయితే వీరి ప్రత్యేకత అంతా పర్వతాలే. ‘డెహరాడూన్లో మా ఆఫీస్ ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో, లద్దఖ్‌లో, హిమాలయాల బేస్ క్యాంప్ వరకు, వింధ్య పర్వతాల్లో మేము పర్వతారోహణకు తీసుకెళతాం. ప్రతి ముగ్గురు టూరిస్టులకు ఒక గైడ్ అనే పద్ధతిని మేము పాటిస్తాం.అందుకే వృద్ధులు, పిల్లలు, ఒంటరి స్త్రీలు... ఎవరైనా సరే క్షేమంగా మాతో పాటు ట్రెకింగ్ చేయవచ్చు. మా గైడ్లు కూడా స్ట్రీలే. అందుకే మేము నిర్వహించే పర్వత యాత్రలకు విశేషంగా టూరిస్టులు వస్తారు’ అంటుంది శశి బహుగుణ. 2013లో మొదలు బ్యాంకింగ్ రంగంలో పని చేసే శశి బహుగుణది డెహ్రాడూన్. పబ్లిషింగ్ రంగంలో పని చేసిన గునిత్ పురిది రుద్రపూర్ (ఉత్తరాఖండ్). గతంలో బిజినెస్ జర్నలిస్ట్‌గా పని చేసిన అనుష సుబ్రమణియన్ది ముంబై. వీరు ముగ్గురికీ పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. తరచూ చేసే ట్రెక్కింగ్‌లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. అయితే 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదలు వీరు ముగ్గురిని కదిలించాయి. వెంటనే పనులన్నీ ఆపి వరద ప్రాంతాలకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటకులను కాపాడారు. ఆ సమయంలోనే వారికి అనిపించింది పర్యాటకులను సురక్షితంగా ఉంచే పర్వతారోహణ యాత్రలను నడిపే సంస్థను ప్రారంభించాలని. ‘అబ్రహం లింకన్‌ను గుర్తు చేసుకున్నాం. పర్వతాల వలన పర్వతాల చేత పర్వతాల కొరకు ఇకపై బతకాలని నిర్ణయించుకున్నాం’ అంది శశి బహుగుణ. ట్రెకింగ్‌ను ఎక్కువగా శశి ప్లాన్ చేస్తుంది. గునిత్ వాహనాలు నడపడంలో ఎక్స్పర్ట్. వంటలో కూడా. అనుష మంచి గైడ్. ‘అందువల్ల మేము కారులో హిమాలయాల్లోని ప్రతి మూల తిరిగాము. మాకు తెలియని పర్వత దారులు లేవు’ అంటారు వారు. ప్రతి ఒక్కరికి హక్కుంది ‘పర్వతారోహణ అంటే వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్లనే అందరూ అనుమతిస్తారు. కాని మేము ఆ నియమం పెట్టుకోలేదు. ఇన్‌క్లూజివ్ ట్రెకింగ్స్ను నిర్వహించాలనుకున్నాం. అనారోగ్యం ఉన్నవారిని, దివ్యాంగులను కూడా ఆరోహణకు తీసుకెళ్లాలనుకున్నాం. ఎందుకంటే పర్వతాలు అందరివి. అందరికీ వాటిని చూసే హక్కుంది. అందుకే పర్వతాలు చూడాలనుకుని వచ్చేవారి హెల్త్ హిస్టరీ అంతా చెక్ చేస్తాం. వారికి ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తాం. అంధులను కూడా చేయి పట్టి 50 కిలోమీటర్ల దూరం మేరకు ట్రెకింగ్‌కు తీసుకెళ్లిన అనుభవం మాకు ఉంది. పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లను కూడా తీసుకెళ్లాం. డయాబెటిక్ పేషెంట్లు కూడా వచ్చారు. అయితే ప్రతి దశలో ఆరోగ్యం చెక్ చేయిస్తూ తీసుకెళతాం. మరీ జటిలంగా మారితే వెంటనే హెలికాప్టర్ తెప్పించి వెనక్కు పంపించేస్తాం’ అంటారు వారు. పహాడీ గైడ్లు అనుష, శశి, గునిత్లు తాము నడుపుతున్న ట్రెకింగ్‌ల కోసం స్థానిక యువతులను గైడ్లుగా తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ‘అందరూ కొండప్రాంతం వారే. లోకల్ గిరిజన యువతులు. వారికి పర్వతాలు కొట్టిన పిండి. అందుకని వారికి తగిన శిక్షణ ఇచ్చి మా టీమ్‌లో కలుపుకున్నాం. మా దృష్టి ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలపై ఉంటుంది. వీరు పిల్లలు ఎదిగొచ్చాక పర్యటనలకు వెళదామనుకుంటారు. అటువంటి వారికి సురక్షితమైన ఏజెన్సీలు ఉన్నాయని తెలియాలి. వారు ఊపిరి పీల్చుకుంటే కుటుంబ కార్యక్రమాల్లో మళ్లీ ఫ్రెష్‌గా పడతారు. మా విన్నపం ఏమంటే ఒంటరిగా తిరగాలనుకున్నా మంచి ఏజెన్సీలను చూసి వెళ్లండి వెళ్లనివ్వండి అని చెప్పడమే’ అంటారు. పర్వతాలను చూపడానికి చుక్కానులుగా మారిన ఈ ముగ్గురు అభినంద నీయులు. -
ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్ ప్రశంసలు.. కారణమిదే..
ప్రముఖ తెలుగు యాంకర్ వింధ్యా విశాఖపై నటుడు సోనూసూద్ ప్రశంసలు కురిపించారు. నిజమైన రాక్‌స్టార్ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా వింధ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో సోనూసూద్ మాట్లాడుతూ..హాయ్ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సాయానికి చిన్న ‘థాంక్స్’ అనే పదం సరిపోదు. సోనూసూద్ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన రాక్‌స్టార్. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది.. మీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి అంటూ పేర్కొన్నారు. గతేడాది కరోనా ప్రారంభం నుంచి సోనూసూద్ ఎంతో మందికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో విరాళాలు సేకరించి ఎంతో మందికి సత్వర సాయమందిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ వింధ్యా కూడా తన వంతు సాయంగా సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చింది. తన దగ్గరున్న ఖరీదైన దుస్తులను వేళం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను సోనూ సూద్ ఫౌండేషన్‌కు పంపించింది. దీనిపై స్పందించిన సోనూసూద్ యాంకర్ వింధ్యాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇక సోనూసూద్ స్వయంగా తనకు బదితులివ్వడంపై ఆమె ఎంతో సంతోషించింది. ఈ వీడియో చూసి మాటలు రావడం లేదని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక యాంకర్ వింధ్యా విశాఖ పలు టీవీ షోలతో పాటు ఐపీఎల్, ప్రొ కబడ్డీ లీగ్‌లకు కూడా ప్రెజంటర్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) చదవండి : ‘అలా చేసి సోనూ సూద్ ఫౌండేషన్‌కు విరాళం ఇస్తా, మద్దతు ఇవ్వండి’ నా దృష్టిలో నాగలక్ష్మి అత్యంత ధనవంతురాలు: సోనూసూద్ -
కరోనా బాధితుల కోసం యాంకర్ వింధ్య వినూత్న ఆలోచన
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో దాదాపుగా సమయానికి వైద్యం అందక చనిపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. హాస్పిటల్స్‌లో ఆక్సిజన్, బెడ్స్ కొరత వల్ల వైద్య సదుపాయాలు అందక ఎంతోమంది తమ సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి సంఘటనలు చూసి చలించిన నటుడు సోనూసూద్ కోవిడ్ బాధితుల కోసం సొంతంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కోవిడ్ బాధితులకు మందులు, ఆక్సిజన్ పంపిణి చేస్తూ సమయానికి ఆదుకుంటున్నారు. దీంతో ఆయన ఫౌండేషన్‌కు విరాళాలు ఇచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. తాజాగా యాంకర్, ఐపీఎల్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు హోస్ట్ వింధ్య సైతం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. తన దగ్గరున్న ఖరీదైన దుస్తులను వేళం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను సోనూ సూద్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తన సహా నటీనటులకు ఆమె విజ్ఞప్తి చేసింది. విషయం తెలుసుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ వింధ్యను ప్రశంసలతో ముంచెత్తింది. ‘ఇది నిజంగా అద్బుతమైన ఆలోచన. నేను కూడా చేస్తాను. నీ వీడియోతో నాలో స్ఫూర్తిని నింపినందుకు థ్యాంక్స్ వింధ్య’ అంటు పోస్టు షేర్ చేసింది. అది చూసి వింధ్య.. ‘థ్యాంక్యూ అనూ నీ నుంచి ఇది ఊహించలేదు’ అంటూ ఆమె మురిసిపోయింది. కాగా, వింధ్య స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో పాటు పలు కార్యాక్రమాలకు, టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ యాంకరింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమె కోవిడ్ కారణంగా ఈ సీజన్ వాయిదా పడటంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) -
ఇతడిని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అనుకున్నా..
ఇది ఐపీఎల్ సీజన్. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది. ‘అరే! తెలుగమ్మాయి. చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబయి అమ్మాయో అనుకునేటట్లు ఉంది’ అని టీవీక్షకుల కళ్లను ఆకర్షిస్తోన్న ఆ అమ్మాయి పేరు వింధ్య విశాఖ మేడపాటి. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి. వింధ్య ఇప్పుడు ముంబయిలో ఉన్న మాట నిజమే. కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది ఘట్కేసర్, హైస్కూల్ నుంచి సికింద్రాబాద్‌లోని అమ్మమ్మగారింట్లో పెరిగింది. నాన్న గుర్రపు స్వారీ చేసేవాడు, జీవితంలో రాజీ పడాల్సిన అవసరం లేని జీవితం ఆయనది. అమ్మ మాత్రం తనను క్రీడాకారిణి కానివ్వకుండా ఆపిన సంప్రదాయపు ఇనుప కచ్చడాన్ని తలచుకుంటూ బాధపడుతుండేది. ‘ఆడపిల్లలు ప్యాంటులేసుకుని ఆటలాడడం ఏంటి’ అని తాతయ్య మొండిపట్టు పట్టకుండా ఉండి ఉంటే మా ఇంట్లో గడచిన తరంలోనే ఓ మహిళావిజయం నమోదై ఉండేది’ అంటోంది వింధ్య. ‘ఆడపిల్ల’ ఈ ఆటలే ఆడాలి, ఈ దుస్తులే ధరించాలి... అని సూత్రీకరించిన ‘సంప్రదాయం’ మా అమ్మకు ఒక జీవితకాలపు అసంతృప్తిని మిగిల్చింది. ఆమె కల నెరవేరలేదు. ‘‘నేను కోరుకున్నట్లుగా నేను ఏదీ సాధించలేకపోయాను. నువ్వు అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఈ సమాజం నిర్దేశించిన అడ్డంకులు నిన్ను అడ్డుకోకుండా నేను అడ్డుపడతాను. నువ్వు కావాలనుకున్న రంగంలో నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధించు’’ అని చెప్పేది అమ్మ. ఆశ్చర్యంగా మా అమ్మమ్మ, నాన్నమ్మ కూడా ఎప్పుడూ అమ్మ అభిప్రాయంతో ఏకీభవించేవారు. నేను స్కూల్లో కబడీ ఆడేటప్పుడు ఇంట్లో వాళ్లు అడ్డుచెప్పలేదు. నాలుగేళ్ల కిందట ప్రో కబడ్డీ ప్రజెంటర్‌గా అవకాశం వచ్చినప్పుడు కూడా ఇంట్లో అందరూ సంతోషించారు. ఆ ప్రజెంటేషనే నాకు ఐపీఎల్లో ప్రజెంటర్ అవకాశాన్ని తెచ్చింది. ఇంగ్లిష్‌లో మందిరాబేడీ, మయంతి లాంగర్ ఉన్నారు. కానీ తెలుగులో లేరు. తెలుగులో తొలి ఉమన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలనుకోవడం లేదు. బెస్ట్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్. నా కెరీర్ విషయంలో అమ్మ ఒకే ఒక్క షరతు పెట్టింది. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పనిసరిగా పీజీ చేయాల్సిందే’నని చెప్పింది. అమ్మ చెప్పినట్లే ఎం.ఏ ఇంగ్లీష్ చేశాను. తోడుగా అమ్మ వచ్చేది స్టార్ స్పోర్ట్స్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాత ముంబయిలో ఉద్యోగం చేయడానికి భయపడలేదు. కానీ హైదరాబాద్ వదలడం బాధనిపించింది. నా లైఫ్‌లో తొలిసారి హోమ్‌సిక్ అయింది ముంబయిలోనే. ఆ సంగతి తెలిసి అమ్మ మరునాడే ముంబయికి వచ్చింది. నా పెళ్లయిన తర్వాత కూడా ఎక్కువగా అమ్మనే తోడు తీసుకెళ్లేదాన్ని. మా వాళ్లు ఎవరూ లేకుండా ముంబయిలో ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి. ఈ దఫా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముంబయిలోనే ఉన్నాను. రెండు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నాం. వర్క్ నుంచి నేరుగా మేము బస చేసిన హోటల్‌కి వచ్చేయాలి. క్వారంటైన్లో ఉంటూ పని చేయడమన్నమాట. హైదరాబాద్‌కి వచ్చేది ఐపీఎల్ పూర్తయిన తర్వాతే’’ అంటూ నవ్వారు వింధ్య విశాఖ. అవకాశం గొప్పది మా హజ్బెండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. చాలా ఏళ్లుగా తెలిసిన కుటుంబమే. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. అర్ధరాత్రయినా సరే మ్యాచ్ చూడాల్సిందే. టెస్ట్‌మ్యాచ్‌లు కూడా పూర్తిగా చూస్తారు. మరీ ఇంత పిచ్చేంటి? ఇతడిని పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని కూడా అనుకున్నాను. అయితే కబడ్డీ ప్రజెంటర్ నుంచి క్రికెట్ వైపు రావడానికి ప్రోత్సాహం, ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఆయనే. ఈ తరం యువతులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... వినూత్నమైన కెరీర్‌ని ఎంచుకునేటప్పుడు పెళ్లయితే అవకాశాలు ఉండవేమోనని చాలామంది భయపడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమేనని చెప్పడానికి నిదర్శనం నేనే. అలాగే నేను తెలుసుకున్న సత్యం మరొకటుంది. టాలెంట్ చాలామందిలో ఉంటుంది. అవకాశాలు కొందరికే వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. – వింధ్య విశాఖ మేడపాటి, స్పోర్ట్స్ ప్రజెంటర్ తల్లి మమతా చక్రవర్తితో వింధ్య – వాకా మంజులారెడ్డి -
నటి వింద్య ప్రచారానికి సిద్ధం
పెరంబూరు: సినీ నటి వింద్య సైతం ఎన్నికలప్రచారానికి సిద్ధమైంది. బుధవారం నుంచి 16వ తేదీ వరకూ ఈమె చెన్నైలోని పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆమె ప్రచార వేళలను, ప్రాంతాలను వెల్లడించారు. అందులో నటి వింధ్య బుధవారం సాయంత్రం 5 గంటలకు షోళింగర్ ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు కుయాత్తం, 8.30 గంటలకు ఆంబూర్ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. అదే విధంగా 11వ తేదీన ఉదయం 11 గంటలకు హోసూర్, సాయంత్రం 5 గంటలకు ఆరూర్, 7 గంటలకు బాప్పిరెడ్డిపట్టి ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. అదే విధంగా 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు పెరియకుళం, 7 గంటలకు ఆండిపట్టి, 13వ తేదీన నీలకోట్టై, సాందూర్, విళాత్తికుళం ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. ఇక 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరమకుడి, 7 గంటలకు మానామధురై ప్రాంతాల్లోనూ, 15వ తేదీన తిరువళ్లూర్ ప్రాంతంలోనూ, 16వ తేదీన పూందమల్లి, తిరుపోరూర్ ప్రాంతాల్లో నటి వింద్య ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. -
ఆకలి తీర్చడంలో వింధ్య పర్వతం
అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు.. అలాంటి అన్నం, కూరలను వృథాగా పారవేసే వారి వద్దకు వెళ్లి.. ఆ ఆహారపదార్థాలను సేకరించి, ఆకలితో అలమటించే అభాగ్యులకు అందిస్తూ.. వారి ఆకలి తీర్చుతోంది సిరిసిల్లకు చెందిన ధరణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు వింధ్యారాణి. చేసేది చిరుద్యోగమైనా, మంచి మనసున్న మారాణి వింధ్యారాణి సిరిసిల్లలోని పేదవర్గాలకు విందు భోజనాన్ని వడ్డించే అక్షయపాత్ర అయింది.. బట్టల సేకరణతో శ్రీకారం... సిరిసిల్లలో 2004లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థను వింధ్యారాణి మరి కొందరితో కలిసి ప్రారంభించారు. సామాజికంగా సేవ చేసేందుకు ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో పెద్ద బాక్స్(అట్టపెట్టె)ను ఏర్పాటు చేసి మీ పిల్లలకు సరిపోని(పట్టని) డ్రెస్‌లను ఈ డబ్బాలో వేయండి.. ఆ దుస్తులను పేద పిల్లలకు మేం అందిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ధరణి సంస్థ ఏర్పాటు చేసిన ఈ డబ్బాలో చాలామంది కొత్త కొత్త డ్రెస్‌లను వేశారు. మంచి మంచి చీరలను మహిళలు స్వచ్ఛందంగా వేశారు. ఇలా వచ్చిన బట్టలను సిరిసిల్ల కార్మికవాడల్లో నిరుపేదలకు పంపిణీ చేశారు. 300 మంది పిల్లలకు డ్రెస్‌లు, మరో 120 మంది మహిళలకు చీరలు అందించారు. బట్టలు పాతవే కావచ్చు. కానీ ఎంతోమందికి అవి కొత్తబట్టలయ్యాయి. అలా ఒక చిన్న ఐడియాతో పేదలకు బట్టలు అందించింది ధరణి సంస్థ. రైస్ బకెట్ పేరుతో సిరిసిల్ల పట్టణంలోని భావనారుషి నగర్‌లోని ఇళ్ల నుంచి బియ్యం సేకరించారు. పది కిలోల చొప్పున 50 కుటుంబాలకు బియ్యం అందించి పేదల ఆకలి తీర్చారు. ఇలా అట్టడుగున ఉన్న నిరుపేదలకు ఉచితంగా సేవలు అందిస్తూ.. ధరణి సంస్థ ముందుకు సాగుతోంది. 15ఏళ్లుగా సిరిసిల్లలో ధరణి సంస్థ మానవీయ కోణంలో సాయం అందింది. భోజనం మిగులు.. లేదు దిగులు... ఊరిలో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా ‘ధరణి’ సంస్థకు ఫోన్ వస్తుంది. సమాచారం అందగానే పరుగున వెళ్లి ప్రత్యేక పాత్రల్లో సేకరించడం.. ఆటోలో తీసుకెళ్లి కార్మికవాడల్లోని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. శుభకార్యాల్లో మిగిలిన ఆ అన్నం, ఆ కూరలను తీసుకెళ్లి కార్మికవాడల్లో పంపిణీ చేయడం పెద్ద శ్రమతో కూడిన పని అయినా నాలుగేళ్లుగా 30 వేల మందికి విందుభోజనాలు అందించిన ఘనత ధరణి సంస్థది. ఇటీవల విందుభోజనాన్ని అడవుల్లో ఆకలితో అలమటించే వన్యప్రాణులకు సైతం అందించారు. గంభీరావుపేట మండలం గోరింటాల అడవుల్లో కోతులకు ఆహారాన్ని అందించడం విశేషం. ఆర్డీవో భిక్షానాయక్ ప్రేరణ... 2015లో సిరిసిల్ల ఆర్డీవోగా పని చేసిన భిక్షానాయక్ ఆలోచనకు ధరణి సంస్థ ఆచరణ రూపమిచ్చింది. సిరిసిల్లలోని ఫంక్షన్ హాల్స్‌లో ధరణి సంస్థ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏ ఫంక్షన్లో ఆహారం మిగిలినా అది పేదల కడుపు నింపేందుకు ఈ సంస్థ శ్రమిస్తుంది. అయిన వారి ఆదరణకు దూరమైన వృద్ధులకు దుస్తులు అందిస్తూ.. స్వీట్లు పంపిణీ చేస్తూ.. ఆసరాగా ఉంటుంది ధరణి సంస్థ. మహిళా దినోత్సవం, హరితహారం, ఎయిడ్స్ బాధిత పిల్లలకు సాయం చేయడంలోనూ ముందుంది. ఓ మహిళ నాయకత్వంలో ధరణి సంస్థ పేదల సేవలో ముందుకెళ్లడం విశేషం. సిరిసిల్లలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేసే వింధ్యారాణి ధరణి సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2018 జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అప్పటి రాష్ట్రమంత్రి కేటీఆర్, అప్పటి జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీదుగా రూ.51,000 నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వింధ్యారాణిని అభినందించారు. నగదు పురస్కారంగా వచ్చిన ఆ మొత్తంతో ఆటోను కొనుగోలు చేసి ధరణి సంస్థ సేవలను విస్తరించేందుకు వినియోగించడం విశేషం. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో నిరుపేదల సేవలో ముందుకు సాగుతున్న ‘ధరణి’ సంస్థ మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆశిద్దాం. – వూరడి మల్లికార్జున్, సాక్షి, సిరిసిల్ల పేదల కళ్లలో ఆనందం చూస్తున్న.. మా సంస్థ అందిస్తున్న సేవలు చిన్నవే అయినా.. పేదల కళ్లలో ఆనందం చూస్తున్న. అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. ధరణి సంస్థ నిర్వహణలో నా భర్త జయసింహారెడ్డి సహకరిస్తున్నారు. సంస్థలోని ఇతర సభ్యులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో బాగా పని చేయగలుగుతున్నాం. – కె. వింధ్యారాణి, సంస్థ అధ్యక్షురాలు -
ఇంపుగా I పలికే P లక్షణం L
ఐపీఎల్ హోస్ట్ కావాలంటే ఇంపుగా పలికే లక్షణం... దాంతోపాటు... విన్నర్ కావాలనే ఆశయం ఉండాలి. సెంచరీ కొట్టే స్ఫూర్తి ఉండాలి. టెస్ట్ మ్యాచ్‌లో సాధించే లక్ష్యాలు... ట్వంటీ ట్వంటీలోనే సాధించేయాలనే తపన ఉండాలి. వింధ్యలో అవన్నీ ఉన్నాయి. ఆమెను విజేతగా చూడాలన్న అమ్మ, అమ్మమ్మ, నానమ్మల ఆశలు... ఆమెను శిఖరం వైపు అడుగులు వేయిస్తున్నాయి. ఓణీ వేసుకుని, చెవులకు జూకాలు పెట్టుకుని కోలాటం వేసేటప్పుడు ఆమెలో అచ్చమైన తెలుగుదనంతోపాటు ముఖంలో స్నిగ్ధత్వం కనిపిస్తుంది. సినిమాల ఆడియో లాంచ్ ప్రోగ్రామ్ నిర్వహించేటప్పుడు అతిశయించిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఫ్యాషన్ షోలో ర్యాంప్ మీద నడుస్తున్నప్పుడు ఆధునికతకు ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తుంది మేడపాటి వింధ్య విశాఖ. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వింధ్య సొంతూరు. అమ్మ పుట్టిల్లు సికింద్రాబాద్. బాల్యం అంతా ఘట్కేసర్, సికింద్రాబాద్‌ల మధ్య సాగింది. ప్రాథమిక విద్య ఘట్కేసర్లో. వారాంతం సికింద్రాబాద్ అమ్మమ్మ దగ్గరకు ప్రయాణం. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ఆన్స్ గర్ల్స్ హైస్కూల్‌కి వచ్చాక సెలవులు వస్తే నానమ్మ ఊరికి పరుగులు. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చమైన బాల్యాన్ని చూసింది. తండ్రి గుర్రం స్వారీ చేస్తున్నప్పుడు హీరోలా కనిపించేవాడామెకి. అప్పటి నుంచి ఐపిఎల్ హోస్ట్‌గా ఎంపికయ్యే వరకు ఉద్వేగభరితమైన ఆనంద క్షణాలు జీవితంలో ఎన్నో ఉన్నాయంటారామె. అన్నా హజారే ఉద్యమం డిగ్రీకి కస్తూర్బా గాంధీ కాలేజ్‌లో చేరడం వింధ్య జీవితంలో పెద్ద మలుపు అనే చెప్పాలి. చదువులో, ఆటల్లో చురుగ్గా ఉండే అమ్మాయి కావడంతో కాలేజ్‌లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే ఆమె పేరే గుర్తొచ్చేది. ఇష్టంగా కొన్ని, లెక్చరర్లు పేరు రాసేసుకున్నారు కాబట్టి కొన్నింటిలో పాల్గొనేది. ‘మిస్ కస్తూర్బా’ పోటీల్లో విజేత ఆమె. ఫ్రెష్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్, ఫ్రెష్ ఫేస్ టైటిల్స్ అందుకునే వరకు మోడలింగ్ వంటి గ్లామర్ ఫీల్డ్ మీద పెద్దగా అవగాహన లేదామెకు. డిగ్రీ తొలి ఏడాది ఇలా ప్రైజ్లందుకుంటూ గడిచిపోయింది. రెండవ ఏడాదిలో ఉన్నప్పుడు అన్నా హజారే లోక్‌పాల్ కోసం ఉద్యమించారు. దేశమంతటా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. అసెంబ్లీలో నిర్వహించిన డిబేట్లో కస్తూర్బా కాలేజ్‌కు ప్రాతినిథ్యం వహించారు వింధ్య. లోక్‌పాల్ గురించి ఆమె మాట్లాడుతున్న తీరు, విషయాన్ని నిరాఘాటంగా, నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో వ్యక్తీకరిస్తున్న విధానం పలువురి దృష్టిని ఆకర్షించింది. మానిటర్ మీద వింధ్య హావభావాలు, ఆంగికం, వాచకం చక్కగా అమరినట్లు ఉన్నాయి. ‘ఆ అమ్మాయికి వార్తలు చదవడం ఇష్టమేమో అడగండి’ అని నిర్వాహకులకు వర్తమానం అందింది. మూడు నెలలు పట్టింది ‘‘మా ఇంట్లో ఎవరూ న్యూస్ మీడియాలో లేరు. ‘ఎస్’ అనడానికి ధైర్యం అసలే లేదు. వాళ్లు చాలా కన్విన్స్ చేశారు. ‘వార్తలు చదవాలా వద్దా’ అనే నిర్ణయానికి తర్వాత రావచ్చు. అప్పుడప్పుడూ ఆఫీస్‌కి వచ్చి చూసి వెళ్తూ ఉంటే, ఈ వాతావరణం అర్థమవుతుందన్నారు. పెద్దవాళ్లు అంతగా చెప్పారు కదా అని నాలుగైదు సార్లు వెళ్లాను. జస్ట్ ఆఫీస్ చూడడం, అక్కడ ఏమేం పనులు జరుగుతుంటాయో, ఎలా జరుగుతుంటాయో తెలుసుకోవడమే. మూడు నెలల తర్వాత వార్తలు చదువుతానని చెప్పాను. అలా హెచ్ఎమ్టీవీతో నా జర్నీ మొదలైంది. అప్పటికి నేను డిగ్రీ సెకండియర్లోనే ఉన్నాను’’ అని తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు వింధ్య. మళ్లీ టీవీకి న్యూస్ రీడర్‌గా ఉన్నప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ కోసం కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మోడలింగ్ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. మన గౌరవానికి ఇబ్బంది కలగనంత వరకు ఎప్పుడు ఏ అవకాశం వస్తే దానిని అందిపుచ్చుకోవాలనేది ఆమె అనుసరించిన జీవన సూత్రం. ఓ ఏడెనిమిది నెలలకు ఆ రంగంలో ఉండే అసౌకర్యాలు అర్థమవసాగాయి. కొందరు కోఆర్డినేటర్లు వృత్తిపరమైన ఫోన్ కాల్స్ చేయకూడని టైమ్‌లో ఫోన్ చేసేవాళ్లు. అత్యవసరమైతే తప్పదు, దానికి తప్పు పట్టాల్సిన పని లేదు. నిజానికి మోడలింగ్ థీమ్ గురించి అప్పుడే మాట్లాడి తీరాల్సిన తప్పని సరి పరిస్థితులేవీ లేకపోయినా అలాంటి వంకతో ఫోన్ కాల్స్ వచ్చేవి. ఆ కారణంతోనే మోడలింగ్‌ని వదిలేశానంటున్నారు వింధ్య. డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత తిరిగి టీవీలోకి వచ్చేశారు. ఆ రావడం రావడం... సినిమా వార్తలు, సినీ అవార్డు వార్తలు – విశేషాలతోపాటు జువెలరీ షో, రెడ్‌కార్పెట్, హాట్వీల్, చాయ్బిస్కట్, హంగామా, సఖిలను సమర్థంగా నిర్వహిస్తూ మా ఊరి వంట అంటూ తెలుగింటి రుచిని చూపించారు. గార్డెన్ పెంచడం, చక్కగా వంట చేయడం, కొత్త కొత్త ప్రదేశాల్లో పర్యటించడం ఆమె హాబీ. ఆఫ్రికా, అమెరికాలలో షోలు చేసే అవకాశం వచ్చినప్పుడు అది పర్యటనలకు కూడా కలిసొచ్చిన అదృష్టంగా భావించారు. ఆరేళ్లలో నేర్చుకున్నది కొండంత ‘‘కస్తూర్బా కాలేజ్ నన్ను విలువలతో జీవించేటట్లు తీర్చిదిద్దింది. మన జీవితం మనకోసం మాత్రమే కాదు సమాజం కోసం కూడా అని నేర్పించింది. అయితే నన్ను ఈ రోజు ఐపీఎల్ హోస్ట్‌గా నిలబెట్టింది మాత్రం టీవీలో పనిచేసిన అనుభవమే. 2012 నుంచి 150కి పైగా ఇంటర్వ్యూలు చేశాను. మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్లను ఇంటర్వ్యూ చేయడానికి బాగా హోమ్‌వర్క్ చేయాలి. నేర్చుకోవడానికి అది గొప్ప అవకాశం. ప్రభాస్, కమల్‌హాసన్, విక్రమ్ వంటి గొప్ప హీరోలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా ఆశ్చర్యం వేసింది. ‘ఐ’ సినిమా రిలీజ్ అయినప్పుడు విక్రమ్‌గారు ఆ సినిమా ఎలా ఉందని అడిగారు. అప్పటికే ఎన్నోసార్లు నిరూపణ అయిన పెర్ఫార్మెన్స్ ఆయనది. అయినా సరే... ప్రతి సినిమాని పరీక్షలాగానే భావిస్తారు. ప్రేక్షకులు అంగీకరిస్తున్నారా లేదా అనే గమనింపు చాలా ఎక్కువ. ప్రభాస్‌గారు చాలా నిజాయితీగా మాట్లాడతారు. అలా ఒక్కో ఇంటర్వ్యూ నాకు ఒక్కో మంచి విషయాన్ని నేర్పించింది. క్రికెట్ పాఠం నేర్చుకున్నాను స్కూల్లో కబడ్డీ బాగా ఆడేదాన్ని. నాకు ఇష్టమైన ఆట కావడంతో ప్రో కబడ్డీకి కామెంటేటర్ అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించాను. కానీ ఐíపీఎల్కి హోస్ట్ చేయడానికి కొంత సంశయించిన మాట నిజమే. ఎందుకంటే నేను క్రికెట్ మ్యాచ్‌లు చూస్తాను. కానీ ఆట మీద పెద్దగా పట్టులేదు. అది కూడా ముంబయిలో ఉద్యోగం. హైదరాబాద్‌లో ఇన్ని అవకాశాలుంటే ముంబయి వెళ్లి చేయడం అవసరమా అనిపించింది. పెద్ద బ్యానర్లో పని చేస్తే ఆ అనుభవం కెరీర్లో బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అంగీకరించాను. ఆ తర్వాత క్రికెట్‌ను పాఠంలా నేర్చుకున్నాను. బ్యాటు, బాలుతో పిచ్ మీద ఆడలేదనే కానీ, ఇప్పుడు క్రికెట్ రూల్స్, ఆటగాళ్ల రికార్డులు కంఠతా వచ్చినట్లే. ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్, మ్యాచ్ ఎనాలసిస్ను హోస్ట్ చేయడం కూడా కుకరీ ప్రోగ్రామ్ చేసినట్లే చేయగలుగుతున్నాను. నూరుశాతం శ్రమించడమే నాకు అవకాశాల కోసం పరుగులు తీయాల్సిన అవసరం రాలేదు. కానీ ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయి నూరుశాతం ఇవ్వడానికి ప్రయత్నించేదాన్ని. ఆ అంకితభావమే ఈ రోజు నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజానికి ‘ఐపీఎల్ హోస్ట్‌గా తొలి తెలుగు మహిళ’ అనే రికార్డు యాదృచ్ఛికమే కావచ్చు. ఒక క్రికెట్ ప్లేయర్ సెంచరీ చేయడమే టార్గెట్ చేసుకున్నట్లు ఒక లక్ష్యంతో చేసిన రికార్డు కాదది. ఐపీఎల్ నిర్వాహకులు తెలుగు కామెంటరీ ప్రవేశపెట్టాలనుకున్నారు. వారి ఎంపికలో నాకు అవకాశం వచ్చింది. నా ట్రాక్ రికార్డే నన్ను ఈ రికార్డుకు దగ్గర చేసింది. అయితే తొలి తెలుగు మహిళా హోస్ట్ అనే ట్యాగ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. ఆ సంగతి ఎప్పుడు తలుచుకున్నా సరే... చిన్నప్పుడు మా నాన్న హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు కలిగిన ఉద్వేగభరితమైన ఆనందమే కలిగి తీరుతుంది. ఆ సంతోషం పువ్వుకు తావిలా నన్ను జీవితాంతం అంటి పెట్టుకునే ఉంటుంది. మా పేరెంట్స్ మమ్మల్ని (నన్ను, అన్నయ్యను) నిరాశావాదంతో రోజులు గడిపేటట్లు పెంచలేదు, ఆశావహ దృక్పథంతో సంతోషాలను ఆస్వాదిస్తూ జీవించడమే నేర్పించారు. అందుకే నాకు జీవితంలో ప్రతి అంశంలో మంచిని చూడడం అలవాటైంది’’ అన్నారు వింధ్య. కెరీర్‌తోపాటు వింధ్య చేసే పనులు చూస్తే తల్లిదండ్రులు ఆమెకు... లేనిదాని కోసం అర్రులు చాచకుండా, ఉన్న దానిని పంచడంలో ఆనందాన్ని పొందడాన్ని నేర్పించారనే అనిపిస్తుంది. ఆమె స్థాపించిన స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా ఎనిమిది మంది విద్యార్థులను చదివిస్తున్నారు. పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేటప్పటికి ఆమె కోసం ఎదురు చూసే పెట్‌డాగ్స్ ఇరవైకి పైగా ఉంటాయి. పెళ్లి గురించి అడిగినప్పుడు సమాధానం దాటవేయకుండా సూటిగా ‘త్వరలోనే పెళ్లి గురించి ఓపెన్‌గానే ప్రకటిస్తాను. నా జీవితభాగస్వామి తన తల్లిదండ్రులను గౌరవించినట్లే మా అమ్మానాన్నలను కూడా గౌరవించాలని కోరుకుంటున్నాను. నన్ను ఇష్టపడినట్లే నా ప్రొఫెషన్ని కూడా ఇష్టపడాలి. అలాంటి అబ్బాయే నాకు వరుడవుతాడు’ అని చెప్పారు. వింధ్యకు యాంకర్ సుమ రోల్‌మోడల్. సుమలాగానే కెరీర్‌ని, కుటుంబాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలనేది వింధ్య ఆశయం. ఆల్ ది బెస్ట్. తాతయ్య ఒప్పుకుని ఉంటే... మా తాతయ్య ఒప్పుకుని ఉంటే మా అమ్మ స్పోర్ట్స్ పర్సన్‌గా ప్రపంచానికి పరిచయమై ఉండేది. పెళ్లయి, అన్నయ్య, నేను పుట్టిన తరవాత కూడా అమ్మకి ఆ అసంతృప్తి పోలేదు. ఆడపిల్లగా పుట్టినందువల్ల ఎదురైన ఆంక్షలే అవన్నీ అనేది. అమ్మమ్మ కూడా... అప్పట్లో తాతయ్యకు నచ్చచెప్పి అమ్మను ప్రోత్సహించి ఉంటే మంచి స్పోర్ట్స్ పర్సన్ అయ్యేదని బాధపడుతుండేది. వాళ్లిద్దరూ నాలో ఒక విజేతను చూడాలని ఆశపడ్డారు. నానమ్మ కూడా వాళ్ల తరంలో ఆడపిల్లకు అందుబాటులో లేని స్వేచ్ఛను నాకిచ్చారు. నువ్వు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే, దానికి రాణింపు వచ్చేలా శ్రమించాలని చెప్పేవారు. ఆ ప్రొఫెషన్ వల్ల నీకు, నీ పని తీరు వల్ల ఆ పనికి గౌరవం పెరగాలి. ‘ఫలానా అమ్మాయి తనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసింది, ప్రొఫెషన్‌కే మచ్చ తెచ్చింద’న్నట్లు ఉండకూడదని చెప్పేవారు. వాళ్లిచ్చిన ధైర్యంతోపాటు వాళ్ల హెచ్చరికలు కూడా గుర్తు వస్తూనే ఉంటాయి. ప్రతిభకు ఆకాశమే హద్దు ఆడవాళ్లకు పెళ్లి, పిల్లల కారణంగా కెరీర్లో కొంత గ్యాప్ తప్పకపోవచ్చు. కానీ పెళ్లి అడ్డంకి కాకూడదు. ఇంట్లో ఉండి కూడా అనేక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్, వంటల పుస్తకాలు రాయడం, బ్లాగ్లు నిర్వహించడం వంటివి చేయవచ్చు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎక్స్ప్లోర్ యువర్సెల్ఫ్ అంటాను. ఇష్టమైన ఏ రంగాన్నయినా ఎంచుకోవచ్చు. అడుగు పెట్టిన రంగంలో ప్రతి అవకాశాన్ని ఒక్కో సోపానంగా భావిస్తూ శిఖరానికి ఎదగాలి. అంతే తప్ప... మనకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి కదా అని ఎవరూ మనల్ని నేరుగా తీసుకెళ్లి పెద్ద హోదాలో కూర్చోబెట్టరు. అలా ఎవరైనా గాడ్ఫాదర్లుండి కూర్చోబెట్టినా వాళ్ల సపోర్టు హ్యాండ్ పక్కకు తీయగానే దబ్బున పడిపోతాం. మనకు మనమే ప్రతిదీ నేర్చుకుంటూ ఎదిగినప్పుడే ఆ ఎదుగుదల పటిష్టంగా ఉంటుంది. – వింధ్య విశాఖ మేడపాటి, ఐపీఎల్ హోస్ట్ -
ఐపీఎల్లో తెలుగమ్మాయి
పోచారం: న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె యాంకర్‌గా మారారు. ఇప్పుడు ఐపీఎల్ హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది వింధ్య విశాఖ. ఐపీఎల్ సీజన్–11లో తొలిసారిగా తెలుగు కామెంటరీకి శ్రీకారం చుట్టి తెలుగు భాషను గౌరవించింది స్టార్ సంస్థ. దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఐపీఎల్లో 30 మ్యాచ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గత సంవత్సరం ప్రోకబడ్డీకి వ్యాఖ్యాతగా వ్యవహరించి స్టార్ స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టి తొలిసారి క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. యాంకరింగ్‌తో సంతృప్తి చెందుతూ.. ఈ రంగంలోనే మరింత రాణించాలని ఆశిస్తున్నానని నారపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చెప్పారు. చదువులో చురుకుదనం.. వింధ్య ఘట్కేసర్కు చెందిన మేడపాటి వెంకటరెడి,్డ శేషారత్నం మనవరాలు మమతా సత్తిరెడ్డి కుమార్తె. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్‌లో మాస్టర్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అటు చదువులోను, ఇటు ఆటల్లోను చురుకుగా ఉండే వింధ్య, హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అన్నా హజారే లోక్‌పాల్ బిల్లు కోసం చేసిన ఉద్యమానికి వలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈమె ప్రసంగాన్ని మెచ్చుకుని తొలిసారి హెచ్ఎంటీవీలో న్యూస్ రీడర్‌గా అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత మోడల్‌గానూ అడుగులు వేశారు. మా మ్యూజిక్ ఛానల్లో ‘ఛాయ్ బిస్కెట్’, టీవీ–9లో హాట్ వీల్స్, ఈటీవీ 2లో సఖీ, మా టీవీలో మా ఊరి వంట వంటి కార్యక్రమాలతో పాటు పలువురు సినీరంగ సెలబ్రిటీల ఇంటర్వ్యూలను అందించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వింద్య. పేదలకు చేయూతనివ్వాలని.. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిస్తే కెరీర్లో రాణించగలరని, ముఖ్యంగా తాను ఎంచుకున్న రంగంలో ప్యామిలీ సపోర్ట్ ఎంతో ఉందని విద్య తెలిపారు. యాంకరింగ్ చేస్తూనే స్వచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించి, పేదలకు చేయూతనిస్తూ సేవాభావం చాటుకుంటున్నారామె. -
బిగ్ బాస్: హరితేజ టాలెంట్ అదుర్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అతిపెద్ద తెలుగు రియాల్టీ షో 'బిగ్ బాస్'. మరికొన్ని గంటల్లో సీజన్ 1 విజేత ఎవరో తేలనుంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లు విజేతగా నిలవాలంటే వారికి ప్రేక్షకుల మద్దతు అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని యాంకర్, నటి హరితేజ చాలా తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ తాను ఫైనల్స్‌కు వెళితే స్వయంగా తానే ప్రేక్షకులను తనకు ఓటేసి గెలిపించాలని కోరాలని భావించారు. ఇందులో భాగంగానే తన క్లోజ్ ఫ్రెండ్ వింధ్యా విశాఖ సాయంతో షోకి వెళ్లకుముందే ఓ వీడియో తీశారు. ఫైనల్స్ నేపథ్యంలో వింధ్యా ఆ వీడియోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు హరితేజతో పాటు శివ బాలాజీ, ఆదర్శ్, నవదీప్, అర్చన కూడా సీజన్ 1 ఫైనల్స్ చేరుకుని టైటిల్ పోరులో ఉన్నారు. అయితే దాదాపు 70 రోజుల కిందటే బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ ముందుచూపుతో ఆలోచించి వీడియో తీసుకున్నారు. తనకు మద్దుతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హరితేజ తనకు ఓటింగ్ చేయాలంటూ వీడియో ద్వారా విజ్ఞప్తిచేశారు. స్నేహితురాలు టైటిల్ నెగ్గాలని ఆశిస్తూ యాంకర్ వింధ్యా ఆ వీడియోను ఇటీవల పోస్ట్ చేయగా.. హరితేజ ప్రయత్నాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'బిగ్ బాస్ తెలుగు ఓట్' అని సెర్చ్‌చేస్తే అధికారిక ఓటింగ్ సైట్ వస్తుంది. -
బిగ్ బాస్: హరితేజ టాలెంట్ అదుర్స్!
-
డాడీ కన్నా మోడీపైనే మోజు
పీఎంకే నేత అన్భుమణికి డాడీ రాందాస్ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని ప్రముఖ సినీ నటి వింధ్య ఆరోపించారు. తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్‌కు మద్దతుగా సినీ నటి వింధ్య మంగళవారం రాత్రి తిరువళ్లూరులోని బజా రు వీధిలో ప్రచారం నిర్వహించారు. హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినవింధ్య పీఎంకే నేత అన్భుమణి రాందాస్ తీరుపై నిప్పులు చెరిగా రు. అన్భుమణికి డాడీ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించే సత్తా అన్నాడీఎంకేకు మాత్రమే ఉంద ని ఆమె వివరించారు. రాష్టంలో ప్రతి పక్షంలో ఉన్న డీఎంకేలో నిజమైన కార్యకర్తలకు, పార్టీకి సేవ చేసిన వారికి న్యాయం జరగటం లేదని ఆరోపించిన ఆమె సినీ నటి ఖుష్బుకు సరైన స్థానం ఇవ్వలేదన్న కారణంగా కరుణానిధి అలిగారని వ్యంగ్యంగా విమర్శించారు. శ్రీలంకలోని తమిళుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్‌ను, మతతత్వ పార్టీ బీజేపీని దళితుల అభివృద్ధి కోసం ఏనాడూ శ్రమించని వీసీకే పార్టీ నేతలను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
'సినీ పరిశ్రమకు వచ్చి తప్పు చేశాను'
బెంగళూరు : 'సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే చిత్రరంగంలోకి ఎందుకొచ్చానా అని బాధపడుతున్నాను' అని నటి వింద్య అన్నారు. జీవితంపై విరక్తి చెందిన ఆమె అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దాంతో వింద్యను కుటుంబ సభ్యులు బౌరింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆమెను వైద్యులు ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం వింద్య తన తల్లిదండ్రులతో కలిసి మాగడి రోడ్డులోని అగ్రహారలోని ఉన్న తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఇకపై తన తల్లిదండ్రులను బాధించే పనులు చేయనని, వారికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటానని అన్నారు. అయితే తన ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులపై మాట్లాడేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. కాగా వింద్య స్నేహితుడు మంజునాథ్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి ఒడిగొట్టిందని వింద్య తల్లిదండ్రులు రంగస్వామి, నాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మనెదమరయల్లి అనే కన్నడ సినిమాలో వింద్య హీరోయిన్గా చేసింది. అదే సినిమాకు అసిసెంట్ డెరైక్టర్‌గా మంజునాథ్ పనిచేశారు. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని సమాచారం. -
నటి వింద్య ఆత్మహత్యాయత్నం
*అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగి కోమాలోకి... *అసిస్టెంట్ డెరైక్టర్ మంజునాథ్ వేధింపులే? బెంగళూరు : జీవితంపై విరక్తి చెందిన నటి వింద్య అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసి ఇక్కడి బౌరింగ్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోందని మంగళవారం పోలీసులు తెలిపారు. వింద్య స్నేహితుడు మంజునాథ్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఈ ఘటనకు ఒడిగొట్టిందని వింద్య తల్లిదండ్రులు రంగస్వామి, నాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనెదమరయల్లి అనే కన్నడ సినిమాలో వింద్య హీరోయిన్గా చేసింది. అదే సినిమాకు అసిసెంట్ డెరైక్టర్‌గా మంజునాథ్ పనిచేశారు. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని సమాచారం. అయితే ఇటీవల మంజునాథ్ నడవడికను గమనించిన వింద్య అతనికి దూరంగా ఉంది. ఈ విషయం జీర్ణించుకోలేని మంజునాథ్ నిత్యం వింద్యకు ఫోన్ చేసి వేధించేవాడని సమాచారం. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో వింద్య మొబైల్‌కు కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వింద్య కొద్దిసేపటికే తన గదిలోకి వెళ్లి బోరున విలపించింది. అనంతరంలో మధుమేహ వ్యాధికి సంబంధించిన మాత్రలు మింగి అస్వస్థతకు గురైంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వింద్య కోమాలో ఉందని, ఆమె కోలుకున్న తర్వాత అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. వింద్య దాదాపు 50కి పైగా మాత్రలు మింగి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారం క్రితం ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో మనెదమరయల్లి చిత్ర నిర్మాత మహేష్, దర్శకుడు రాజీవ్ వింద్య, మంజునాథ్‌లను పిలిపించి మందలించినట్లు సినీవర్గాల సమాచారం. తన కుమార్తె చేతులపై సిగరెట్‌తో కాల్చి, సృహ తప్పేటట్లు చేసిన మంజునాథ్ లైంగికదాడికి కూడా పాల్పడ్డాని వింద్య తండ్రి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ర్యాంప్అందాల పూలదారి
సరిగ్గా రెండ్రోజుల క్రితం గ్లామర్ పపంచంలో భారతీయ అందం మరోసారి త‘లుక్’మంది. ఏకంగా అమెరికా దేశపు అందాల కిరీటాన్ని స్వంతం చేసుకున్న విజయవాడ అమ్మాయి నీనా దావులూరి మరోసారి మన గ్లామర్ సత్తాను ప్రపంచానికి చాటింది. రకరకాల భయాలను, బిడియాలను త్వరత్వరగా వదుల్చుకుంటున్న తెలుగమ్మాయిలు మోడలింగ్‌లో రాణిస్తున్నారు. మరెందరో అమ్మాయిలు ‘మోడల్స్’గా మెరిసేందుకు రాచబాట పరుస్తున్నారు. మోడలింగ్ అంటే అదేదో కేవలం అందాల ప్రదర్శన మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. అయితే మిగిలిన అన్ని రంగాల తరహాలోనే అటు అందం ఇటు ఆత్మ విశ్వాసం, తెలివితేటలు అన్నీ ఉంటేనే మోడల్‌గా వెలుగొందడం సాధ్యమని గ్రహిస్తున్నారు. మోడల్‌గా మంచి అవకాశాలు దక్కించుకోవడం అనేది సినిమాలకు రెడ్‌కార్పెట్ అని కూడా అర్థం అవడంతో ఇటువైపు రావడానికి మరింతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న కొందరు హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక మోడల్స్‌ను పలకరించినప్పుడు ఇలా స్పందించారు. - ఎస్. సత్యబాబు ఎన్నో రిహార్సల్స్... కంప్యూటర్సైన్స్లో ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఒక మంచి జాబ్ ఎంత అవసరమో మనల్ని మనం ఇతరత్రా నిరూపించుకునే యాక్టివిటీ కూడా అంతే అవసరం కదా! అలాంటిదే మోడలింగ్. చదువుతో పాటు, జాబ్ చేస్తూనే మానసిక సంతృప్తి కోసం మోడల్‌గానూ కొనసాగాలనేది నా ఆశయం. పెద్ద సంఖ్యలో జనం మనల్ని చూస్తూ హర్షధ్వానాలు చేస్తుంటే వచ్చే ఆనందం వేరు కదా! ఆ ఆనందాన్ని పొందేందుకే మోడల్‌గా మారాను. అయితే జనం ముందు కనపడే ఆ మెరుపుల వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ర్యాంప్ మీద మెరిసేందుకు ఎన్నోసార్లు రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిచేసినా ఒక్కసారి టాప్ మోడల్ అనిపించుకుంటే ఇక అన్నీ మర్చిపోతాం. తప్పనిసరిగా వారంలో ఐదు రోజుల పాటు రోజుకు గంటన్నర చొప్పున వ్యాయామం చేయడం దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్లామర్ రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం దాకా మా గెలుపు వెనుక ఎంతో కృషి ఉంటుంది. ఈ రంగంలో నన్ను ఎంతమంది నిరుత్సాహపరచాలని చూసినా మా అమ్మ మాత్రం ప్రోత్సహించింది. టీవీలో, మేగ్జైన్లో, షోస్‌లో నన్ను చూసినప్పుడల్లా చుట్టుపక్కలవారికి చూపించి మురిసిపోతుంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ తరహాలో ఈ రంగంలో నా ప్రస్థానాన్ని సాగించాలనుకుంటున్నాను. - మోనిక.టి ఏ రంగంలో పనిచేసినా... మోడలింగ్‌ను దేనితోనూ పోల్చలేం. ఎందుకంటే అందులో ఉండే గ్లామర్, ఆ రంగానికి ఉన్న ఆకర్షణ అలాంటివి. ప్రస్తుతం ప్రముఖ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తున్నాను. టీనేజ్ నుంచి ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లో ప్రయత్నాలు ప్రారంభించాను. ఈ ప్రొఫెషన్లో రాణించడానికి చక్కని ఫిజిక్ తప్పనిసరి. దీనికోసం ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లడం, డైట్ ఫాలో అవడం చేస్తున్నాను. ఫిజికల్ ట్రైనర్ కూడా ఉన్నారు. ఈ రంగం మీద ఉన్న రకరకాల వ్యాఖ్యానాలను పట్టించుకోకుండా మా తల్లిదండ్రులు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుండడం నా అదృష్టం. వారే నాకు ప్రథమ విమర్శకులు కూడా. ఏ రంగంలో ఉన్నా మన విద్యార్హతలను ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిందే! ఆ క్రమంలోనే నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లీష్) చేస్తున్నాను. - వింధ్య అందచందాలు మాత్రమే సరిపోవు... ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తున్నాను. గ్లామర్ రంగంలో అందం అనేది ఒక ప్రాథమిక అర్హత మాత్రమే. చూడచక్కని రూపంతో బాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం వంటివి సైతం ఉంటేనే గ్లామర్ రంగంలో ఎదగగలం. నేను ఈ రంగానికి వచ్చి రెండేళ్లవుతోంది. చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌లోకి రావాలనుకుని దానికి అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని లఖోటియా మోడలింగ్ ఇన్స్టిట్యూట్లో జేరాను. శిక్షణానంతరం ప్రసాద్ బిడప్ప మోడలింగ్ హంట్‌లో పాల్గొన్నాను. గత జూలైలో జరిగిన లఖోటియా ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాను. ప్రస్తుతం పలు సంస్థల ఫొటో షూట్స్‌లో పాల్గొంటున్నాను. పలు బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. ర్యాంప్ షోలలో పాల్గొంటున్నాను. టాప్ మోడల్‌గా ఎదగాలని, బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను. - ప్రియాంక