నటి వింద్య ప్రచారానికి సిద్ధం | Actress Vindhya Ready For Election Campaign in Tamil nadu | Sakshi
Sakshi News home page

నటి వింద్య ప్రచారానికి సిద్ధం

Published Wed, Apr 10 2019 12:35 PM | Last Updated on Wed, Apr 10 2019 12:35 PM

Actress Vindhya Ready For Election Campaign in Tamil nadu - Sakshi

పెరంబూరు: సినీ నటి వింద్య సైతం ఎన్నికలప్రచారానికి సిద్ధమైంది. బుధవారం నుంచి 16వ తేదీ వరకూ ఈమె చెన్నైలోని పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆమె ప్రచార వేళలను, ప్రాంతాలను వెల్లడించారు. అందులో నటి వింధ్య బుధవారం సాయంత్రం 5 గంటలకు షోళింగర్‌ ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు కుయాత్తం, 8.30 గంటలకు ఆంబూర్‌ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు.

అదే విధంగా 11వ తేదీన ఉదయం 11 గంటలకు హోసూర్, సాయంత్రం 5 గంటలకు ఆరూర్, 7 గంటలకు బాప్పిరెడ్డిపట్టి ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. అదే విధంగా 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు పెరియకుళం, 7 గంటలకు ఆండిపట్టి, 13వ తేదీన నీలకోట్టై, సాందూర్, విళాత్తికుళం ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. ఇక 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరమకుడి, 7 గంటలకు మానామధురై ప్రాంతాల్లోనూ, 15వ తేదీన తిరువళ్లూర్‌ ప్రాంతంలోనూ, 16వ తేదీన పూందమల్లి, తిరుపోరూర్‌ ప్రాంతాల్లో నటి వింద్య ప్రచార  కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement