డాడీ కన్నా మోడీపైనే మోజు | Actress Vindhya comments on Anbumani Ramadoss | Sakshi
Sakshi News home page

డాడీ కన్నా మోడీపైనే మోజు

Published Thu, Apr 3 2014 9:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

డాడీ కన్నా మోడీపైనే మోజు

డాడీ కన్నా మోడీపైనే మోజు

పీఎంకే నేత అన్భుమణికి డాడీ రాందాస్ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని ప్రముఖ సినీ నటి వింధ్య ఆరోపించారు. తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్‌కు మద్దతుగా సినీ నటి వింధ్య మంగళవారం రాత్రి తిరువళ్లూరులోని బజా రు వీధిలో ప్రచారం నిర్వహించారు. హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినవింధ్య పీఎంకే నేత అన్భుమణి రాందాస్ తీరుపై నిప్పులు చెరిగా రు. అన్భుమణికి డాడీ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని విమర్శించారు.
 
 రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించే సత్తా అన్నాడీఎంకేకు మాత్రమే ఉంద ని ఆమె వివరించారు. రాష్టంలో ప్రతి పక్షంలో ఉన్న డీఎంకేలో నిజమైన కార్యకర్తలకు, పార్టీకి సేవ చేసిన వారికి న్యాయం జరగటం లేదని ఆరోపించిన ఆమె సినీ నటి ఖుష్బుకు సరైన స్థానం ఇవ్వలేదన్న కారణంగా కరుణానిధి అలిగారని వ్యంగ్యంగా విమర్శించారు. శ్రీలంకలోని తమిళుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్‌ను, మతతత్వ పార్టీ బీజేపీని దళితుల అభివృద్ధి కోసం ఏనాడూ శ్రమించని వీసీకే పార్టీ నేతలను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement