pmk leader
-
పీఎంకే ఎమ్మెల్యేపై వరకట్నం కేసు
సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కుటుంబంపై వరకట్నం కేసు నమోదైంది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో సూరమంగలం మహిళా పోలీసులు మంగళవారం రంగంలోకి దిగారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు పీఎంకే ఎమ్మెల్యేగా సదా శివం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు శంకర్‌కు 2019లో సర్కారు కొల్లపట్టికి చెందిన మనోలియాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర బిడ్డ ఉంది. ఈ పరిస్థితుల్లో తన భర్త శంకర్, మామ సదాశివం, అత్త బేబి, ఆడపడుచు కలైవాణి వరకట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నట్లు మనోలియా ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంపై ఆరు సెక్షన్లతో కేసు నమోదైంది. కాగా విచారణకు రావాలని ఎమెల్యేకు మంగళవారం మహిళా పోలీసు స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. -
30 రోజుల్లో జయ జైలుకెళ్లడం ఖాయం
కేకే.నగర్ : నెల రోజుల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని పీఎంకే నేత రామదాస్ జోస్యం చెప్పారు. విల్లుపురం జిల్లా తిరుకోవిలూర్ సమీపంలోని వీరపాండి గ్రామంలో తిరుకోవిలూర్ నియోజకవర్గంలో పీఎంకే తరఫున బహిరంగ సమావేశం జరిగింది. అందులో పార్టీ నేత రామదాస్ మాట్లాడుతూ కొందరు కోట్ల రూపాయలు సంపాదించి కోర్టుకు, జైలుకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారన్నారు. జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసు బెంగళూరులో 18 సంవత్సరాలుగా నడుస్తోంది. ఈ కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారీ కాంట్రాక్టుల్లో కూడా దోపిడీ సంఘటనలు జరుగుతున్నాయి. జయలలిత కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. మరో 30 రోజుల్లో అదే జైలుకు మళ్లీ జయలలిత వెల్లడం ఖాయం. ఎంజీఆర్‌తో నటించి అధికారం చేజిక్కించుకున్న జయలలిత బాగా నటించగలరు. ఎదుటి వారు నమ్మే విధంగా అబద్దం చెప్పగలరు అని రామదాస్ మాట్లాడారు. -
నేనే సీఎం అభ్యర్థి
- అన్భుమణి స్పష్టీకరణ పీఎంకే ఇప్పటికే తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు... తానే తమిళనాడు సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ యువజన నేత అన్భుమణి రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే ఎన్నికల వ్యూహాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్న నిర్ణయానికి పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు వచ్చిన విషయం తెలిసిందే. తమ నేతృత్వంలోనే కూటమి అని ప్రకటించి, తమ సీఎం అభ్యర్థిగా తనయుడు, యువజన నేత అన్భుమణి రాందాసు పేరును ప్రకటించేశారు. ప్రజాకర్షణ దిశగా అన్భుమణి రాష్ర్టంలో ఉరుకలు పరుగులు తీస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పీఎంకే మనసు మార్చుకోవచ్చన్న సంకేతాలు బయల్దేరాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలన్నీ ఒకే కూటమి ఏర్పాటుతో ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం బయల్దేరింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రజా కూటమి ఆవిర్భవించినా, అటు వైపుగా రాందాసు తొంగి చూడ లేదు. ఈ పరిస్థితుల్లో పీఎంకే ప్రజా కూటమి వైపుగా తొంగి చూసే అవకాశాలు కన్పిస్తున్నాయని, డిప్యూటీ ఇచ్చినా సర్దుకునే పరిస్థితులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఓ మీడియాకు అన్భుమణి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ ప్రచారానికి బలం చేకూర్చేట్టుగా మారింది. దీంతో మేల్కొన్న అన్భుమణి రాందాసు తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేనే లేదన్న సంకేతాల్ని పార్టీ వర్గాలకు, ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రజా కూటమితో కలసి పనిచేయడానికి సిద్ధం అన్నట్టుగా వచ్చిన వార్తల్ని ఖండించారు. కూటమి పాలనకు సిద్ధం అన్నామే గానీ, కూటమిగా ఇతరులతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అని చెప్పలేదని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న తపనతో తమ పయనం సాగుతోందని, అంతే గానీ ఇతరులతోకలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, పీఎంకే నేతృత్వంలో పనిచేయడానికి వచ్చే పార్టీలను ఆహ్వానిస్తామని, ఆ కూటమికి తానే సీఎం అభ్యర్థి అని తెలిపారు. -
డాడీ కన్నా మోడీపైనే మోజు
పీఎంకే నేత అన్భుమణికి డాడీ రాందాస్ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని ప్రముఖ సినీ నటి వింధ్య ఆరోపించారు. తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్‌కు మద్దతుగా సినీ నటి వింధ్య మంగళవారం రాత్రి తిరువళ్లూరులోని బజా రు వీధిలో ప్రచారం నిర్వహించారు. హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినవింధ్య పీఎంకే నేత అన్భుమణి రాందాస్ తీరుపై నిప్పులు చెరిగా రు. అన్భుమణికి డాడీ కన్నా మోడీపైనే ఎక్కువ మోజు ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించే సత్తా అన్నాడీఎంకేకు మాత్రమే ఉంద ని ఆమె వివరించారు. రాష్టంలో ప్రతి పక్షంలో ఉన్న డీఎంకేలో నిజమైన కార్యకర్తలకు, పార్టీకి సేవ చేసిన వారికి న్యాయం జరగటం లేదని ఆరోపించిన ఆమె సినీ నటి ఖుష్బుకు సరైన స్థానం ఇవ్వలేదన్న కారణంగా కరుణానిధి అలిగారని వ్యంగ్యంగా విమర్శించారు. శ్రీలంకలోని తమిళుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్‌ను, మతతత్వ పార్టీ బీజేపీని దళితుల అభివృద్ధి కోసం ఏనాడూ శ్రమించని వీసీకే పార్టీ నేతలను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.