హర్ష కుమార్, తులికా సింగ్
హర్ష కుమార్, తులికా సింగ్ జంటగా దీపక్ బలదేవ్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాస్ట్ సీన్’ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ నిర్మిస్తోంది. ప్రకాశ్ ఠాకూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా సల్మాన్ సర్కార్ తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ‘‘కథ అద్భుతంగా కుదిరింది. ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఈ నెల 20న హైదరాబాద్‌లో మూడు రోజులు షూట్ చేస్తాం. తర్వాత కేరళలో చిత్రీకరణ జరపుతాం. ఈ షెడ్యూల్ 18 రోజుల పాటు జరుగుతుంది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు దీపక్ బలదేవ్. మధునారాయణ్, హిమాయత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రమణ్ గోయల్ సంగీతం అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment