ఎన్టీఆర్తో కుమారి..? | heba patel in ntr sukumar nannaku prematho | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్తో కుమారి..?

Published Sun, Dec 13 2015 11:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

ఎన్టీఆర్తో కుమారి..?

ఎన్టీఆర్తో కుమారి..?

కుమారి 21ఎఫ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హేబాపటేల్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తొలి సినిమాలోనే బోల్డ్ యాక్టింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటి ప్రస్తుతం రాజ్ తరుణ్, నిఖిల్ సినిమాల్లో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈసినిమాలు ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే మరో క్రేజ్ ఆఫర్ను పట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన ఆడిపాడే ఛాన్స్ కొట్టేసింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నాడు. స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్కు హేబాను సెలెక్ట్ చేశారట. నిర్మాతగా హేబాకు తొలి బ్రేక్ ఇచ్చిన సుకుమార్, దర్శకుడిగా ఈ అమ్మడికి స్టార్ హీరో సరసన ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమాలో కూడా హేబా పాత్ర కుమారి 21ఎఫ్ తరహాలోనే బోల్డ్గా ఉండనుందట. కెరీర్ స్టార్టింగ్లోనే స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటి ముందు ముందు స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement