భయమేం లేదు నాకు! | Heinrich Popow looks forward to meeting Priyanka Chopra | Sakshi
Sakshi News home page

భయమేం లేదు నాకు!

Published Fri, Dec 4 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

భయమేం లేదు నాకు!

భయమేం లేదు నాకు!

కథానాయికలు నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం కొత్త కాదు. పూజా భట్, జూహీ చావ్లా, అనుష్కా శర్మ, దియా మిర్జా, అమీషా పటేల్.. ఇలా హిందీ రంగంలో పలువురు తారలు నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హాట్ గాళ్ ప్రియాంకా చోప్రా కూడా ఎప్పట్నుంచో నిర్మాతగా మారాలనుకుంటున్నారు. ‘మేడమ్‌జీ’ పేరుతో ఓ సినిమా ప్రకటించారు కూడా. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది. కానీ, ‘మేడమ్‌జీ’ని ప్రకటన వరకే పరిమితం చేసేశారు.

కథానాయికగా కోట్లు తీసుకుంటున్నప్పటికీ నిర్మాతగా పెట్టుబడి పెట్టడానికి ప్రియాంక భయపడుతున్నారనీ, అందుకే వెనకడుగు వేసేశారన్నది కొంతమంది ఊహ. కానీ, భయమా? నాకా? అంటున్నారీ బ్యూటీ. ‘‘హిందీ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’, అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీగా ఉండడంవల్ల ‘మేడమ్‌జీ’ని మొదలుపెట్టేకపోయాను. ఎప్పుడు మొదలుపెడతానో చెప్పలేను కానీ, కచ్చితంగా ఈ సినిమా నిర్మిస్తాను’’ అని ప్రియాంక పేర్కొన్నారు.

కొత్తవారికి ఆహ్వానం. ‘పర్పుల్ పెబల్స్ పిక్చర్స్’ పతాకంపై ఆమె సినిమాలు తీయాలనుకుంటున్నారు. కొన్ని చిత్రాల్లో తాను నటించాలనుకుంటున్నారు. స్టార్స్‌తో కొన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. కొత్తవారితో కూడా సినిమాలు తీయాలనుకుంటున్నానని ప్రియాంక తెలిపారు. కొంతమంది రచయితలతో కలిసి కొన్ని స్క్రిప్ట్స్ కూడా వర్కవుట్ చేశారట. అనుకూలమైన సమయం చూసుకుని, వాటి గురించి ప్రకటిస్తానని ఆమె అన్నారు.

నిర్మాణ రంగంలోకి మాత్రమేనా? దర్శకురాలిగా కూడా మారాలనుకుంటున్నారా? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే - ‘‘నా సినిమాల షూటింగ్ స్పాట్స్‌లో డెరైక్టర్స్ జాబ్‌ని గమనిస్తుంటాను. ఎలా చేస్తున్నారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. డెరైక్షన్ అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఉన్న బిజీలో దాని గురించి ఆలోచించలేను. కంటి నిండా నిద్రపోవడానికి కూడా టైమ్ దొరకడంలేదు. బాగా తీరిక చిక్కినప్పుడు డెరైక్షన్ గురించి ఆలోచిస్తాను. నాకు తెలిసి ఇప్పుడప్పుడే మాత్రం కాదు’’ అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement