అదే జోష్... అదే సందడి! | hero chiru 150th movie started | Sakshi
Sakshi News home page

అదే జోష్... అదే సందడి!

Published Thu, Jun 23 2016 11:04 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

అదే జోష్... అదే సందడి! - Sakshi

అదే జోష్... అదే సందడి!

‘కొన్నిసార్లు షూటింగ్ స్టార్ట్ చేయడం లేటవచ్చేమో కానీ, అభిమానులకు కిక్ ఇవ్వడం మాత్రం పక్కా’ - మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా స్టేటస్ ఇది. గురువారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తొమ్మిదేళ్ల తర్వాత మేకప్ వేసుకున్నప్పటికీ, ‘చిరంజీవిలో అదే జోష్.. సెట్‌లో అదే సందడి!’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో మెగాస్టార్ ఎలా కనిపిస్తారోనని ఎదురుచూసిన అభిమానుల కోసం తొలి రోజు చిరంజీవి, అలీ చిత్రీకరణలో పాల్గొన్న ఫోటోలను విడుదల చేశారు.


ఇందులో చిరు లుక్ అభిమానులకు కిక్ ఇచ్చే విధంగానే ఉందనాలి. దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ - ‘‘సామాన్య రైతు సమస్యల గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఆయన్నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం, నృత్యాలు, పాటలు, ఫైట్స్, భావోద్వేగాలు.. అన్నీ చిత్రంలో ఉంటాయి. మంచి కథ, మంచి సాంకేతిక నిపుణులు కుదిరారు. ఈ షెడ్యూల్‌లోనే కథానాయిక చిత్రీకరణకు హాజరవుతారు. ఆగస్టు 12 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరుగుతుంది. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం: రత్నవేలు, కళ: తోట తరణి, సంగీతం: దేవి శ్రీప్రసాద్, నిర్మాతలు: సురేఖ, రామ్‌చరణ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement