
‘ఛలో’ చిత్ర కథానాయకుడు నాగశౌర్య పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో శనివారం సాయంత్రం సందడి చేశారు. కళాశాల ఆడిటోరియంలో అందరితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను విజయవాడలోనే పెరిగానని, టిక్కిల్ రోడ్డులో తిరిగానని చెప్పాడు. నగరానికి వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నాడు. ‘ఛలో టీజర్‌ను యూట్యూబ్‌లో చూశారా’ అంటూ విద్యార్థులను అడిగాడు. పైరసీని ఎంకరైజ్ చేయవద్దు అన్నారు. అనంతరం నాగశౌర్యతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. – మొగల్రాజపురం
Comments
Please login to add a commentAdd a comment