పబ్‌జీ : తూటా పేల్చకుండానే హీరో చికెన్‌ డిన్నర్‌ | Hero Nikhil wins chicken dinner in pubg without kills | Sakshi
Sakshi News home page

పబ్‌జీ : తూటా పేల్చకుండానే హీరో చికెన్‌ డిన్నర్‌

Published Fri, Mar 29 2019 11:31 AM | Last Updated on Fri, Mar 29 2019 11:50 AM

Hero Nikhil wins chicken dinner in pubg without kills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇప్పుడు దేశవ్యాప్తంగా యువతకు వ్యసనంగా మారిన ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్‌జీ. ఈ గేమ్‌లో విజేతలుగా నిలిచిన వారు గెలుచుకునే టైటిలే విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌. విజేతలుగా నిలవడానికే గంటలు గంటలు ఈ గేమ్‌లో గడుపుతుంటారు. టైటిల్‌ దక్కాలంటే తమతో పాటు ఆన్‌లైన్‌లో పాల్గొన్నవారిని కాలుస్తూ ముందుకు వెళ్లాల్సిందే. అయితే పబ్‌జీ గేమ్‌లో ఒక్కరిని కూడా చంపకుండానే ఏకంగా చికెన్‌ డిన్నర్‌ కొట్టేశాడు టాలీవుడ్‌ హీరో నిఖిల్‌. ఈ మేరకు నిఖిల్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు. 

ఒక్కరిని కూడా చంపకుండానే సోలో గేమ్‌లో చికెన్‌ డిన్నర్‌ కొట్టేశా అంటూ పోస్ట్‌ పెట్టారు. ఎలాంటి హింసలేకుండానే విజేతగా నిలిచానని పేర్కొన్నారు. గేమ్‌కు సంబంధించి స్క్రీన్‌ షాట్‌ను కూడా పోస్ట్‌ చేశారు. ఈ గేమ్‌లో ఆఖరి వరకు సేఫ్‌ గేమ్‌ ఆడినా చివరికి ఇంకోకరు మిగులుతారు కదా. అలాంటప్పుడు కనీసం ఒక్కరినైనా చంపాల్సి వస్తుంది కదా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీనికి బదులుగా.. చివరికి మిగిలిన వ్యక్తి బ్లూజోన్‌లో చిక్కుకొని ఫినిష్‌ అయ్యిఉంటాడని మరికొందరు బదులిస్తున్నారు.ఇటీవలే అర్జున్ సురవరం చిత్రం ప్రమేషన్‌లో భాగంగా పబ్జి గేమ్‌లో ప్రత్యేకంగా ఓ రూమ్‌ను క్రియేట్‌ చేసి తన అభిమానులతో కలిసి నిఖిల్‌ గేమ్‌ ఆడిన విషయం తెలిసిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement