
ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభ కార్యక్రమంలో బాలకృష్ణ, రాజశేఖర్, జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్ : హీరో బాలకృష్ణ.. తన తండ్రి పాత్ర పోషిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ మధ్యే సినీరాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ నిజజీవితంలోని ముఖ్యపాత్రలను సినిమాలో ఎవరు పోషిస్తారనే విషయంపై ఇప్పటివరకు చిత్ర యునిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదివరకే కథలో కీలకమైన నాదెండ్ల భాస్కరరావు పాత్రకు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ జీవితంలో కీలకమైన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రను హీరో రాజశేఖర్ పోషించనున్నట్లు టాలీవుడ్ సమాచారం.
హీరో రాజశేఖర్, బాలకృష్టలు ఇద్దరు మంచి సన్నిహితులు. గరుడవేగ సినిమా ప్రమోషన్‌లో పాల్గోన్న బాలకృష్ణను ఉద్దేశించి ఆయనతో కలిసి నటించాలనే కోరికను రాజశేఖర్ బయట పెట్టారు. దీంతో ఇద్దరం కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేద్దాం అని బాలకృష్ణ సమాధానం ఇవ్వడం అప్పట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్‌తో బాలకృష్ణ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రను హీరో రాజశేఖర్‌కు ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో జీవిత రాజశేఖర్‌లు పాల్గొనటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment