అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: విశాల్‌ | hero vishal break the silence on his marriage | Sakshi
Sakshi News home page

అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: విశాల్‌

Published Thu, Jul 20 2017 7:03 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: విశాల్‌

అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: విశాల్‌

చెన్నై: త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు నటుడు, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌ ప్రకటించారు. లక్ష్మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తెలిపారు. తాజాగా ఆయన తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫాక్టరీ, ఎస్‌.నందగోపాల్‌ మెడ్రాస్‌ ఎంటర్‌ ప్రైజస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కన్‌ దర్శకుడు. అను ఇమ్మాన్యూల్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో కె.భాగ్యరాజ్, ప్రసన్న వంటి పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అరోల్‌ కరోలి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరో విశాల్‌ మాట్లాడుతూ తనకు బాగా ఇష్టచైన దర్శకుడు మిష్కిన్‌ అని పేర్కొన్నారు. తాను ఆయన  కలిసి చిత్రం చేయాలని గత ఎనిమిదేళ్లుగా అనుకుంటున్నామనీ, ఇది ఈ తుప్పరివాలన్‌ వంటి మంచి చిత్రం ద్వారా నెరవేరిందని పేర్కొన్నారు. తుప్పరివాలన్‌ చిత్రంలో తన పోరాట దృశ్యాలు ది బెస్ట్‌గా ఉంటాయని చెప్పారు. నటుడిగా, నిర్మాతగా ఈ చిత్రం తనకు చాలా స్పెషల్‌ అని పేర్కొన్నారు. ఇకపోతే తాను, నటుడు ప్రసన్న హీరోయిన్‌ సిమ్రాన్‌కు వీరాభిమానులం అని చెప్పారు. ఈ చిత్రంలో ఆమెతో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. తాను కామరాజర్‌ బాటలో పయనిస్తాననీ, అలాగని రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. త్వరలోనే లక్ష్మి లాంటి అమ్మాయితో తన పెళ్లి జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో తారల డ్రగ్స్‌ విషయం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఆ వ్యవహారం ఇప్పుడు విచారణలో ఉందనీ, అది పూర్తి అయిన తరువాత స్పందిస్తానని అన్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని విశాల్‌ హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement