
కృష్ణంరాజుతో ఓ వేడుకలో కృష్ణకుమారి
కృష్ణంరాజు తొలి కథానాయిక కృష్ణకుమారి. ఆమెతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘చిలకా గోరింక’. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. తొలి హీరోయిన్ గురించి ‘సాక్షి’తో కృష్ణంరాజు చెప్పిన విశేషాలు.
► కృష్ణకుమారి కంటే మీరు దాదాపు పదేళ్లు చిన్న. ఆవిడ మీ ఫస్ట్ హీరోయిన్ అన్నప్పుడు ఎలా అనిపించింది?
వయసులోనే కాదు.. హోదాలోనూ ఆమె ఎక్కువే. నేను ‘చిలకా గోరింక’ ఒప్పుకున్న సమయానికి ఆమె స్టార్ హీరోయిన్. నాకది ఫస్ట్ సినిమా. దర్శకుడు ప్రత్యగాత్మగారు కృష్ణకుమారిగారితో యాక్ట్ చేయాలన్నప్పుడు నాకేమీ అనిపించలేదు. పైగా ఆవిడ తానో పెద్ద స్టార్ అనే ఫీలింగ్‌ని ఎక్కడా బయటపెట్టలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కో–ఆపరేట్ చేసేవారు.
► అంత పెద్ద స్టార్‌తో డ్యూయెట్స్ పాడటానికి ఏమైనా ఇబ్బందిపడ్డారా?
కెమెరా ముందుకెళ్లాక నాకు పర్సనల్ లైఫ్ గుర్తుకు రాదు. ఆమెను ఓ కో–స్టార్‌లానే చూశాను. కృష్ణకుమారిగారు చాలా కూల్ నేచర్. అందుకేనేమో ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు.
► అంటే.. ఆమె చిరాకుపడిన సందర్భం ఒక్కటి కూడా లేదా?
ఒకే ఒక్కసారి చూశాను. మేమిద్దరం క్లోజ్‌గా ఉండే సీన్స్ తీసేటప్పుడు హైట్ మ్యాచ్ చేయడానికి ఆమెను పీట మీద నిలబడమన్నారు. ప్రత్యగాత్మగారు పీట తెప్పించాక ‘కొంతమంది హీరోలు నా పక్కన పీట మీద నిలబడేవారు. ఇప్పుడు నేను నిలబడాలా?’ అని చిరాకు పడ్డారు. యాక్చువల్‌గా కృష్ణకుమారిగారు మంచి ఎత్తే. కానీ నా హైట్‌కి మ్యాచ్ అవ్వడానికి పీట వేయాల్సి వచ్చింది.
► ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి పిలిచేవారా?
అవును. నా ఫస్ట్ మూవీ ‘చిలకా గోరింక’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫంక్షన్‌కి రావాలని ఆమెతో అన్నాను. ‘రాకుండానా? తప్పకుండా వస్తాను’ అన్నారు. కానీ సడన్‌గా ఇలా అయిపోయింది. మంచి నటి, మంచి వ్యక్తిని కోల్పోయాం.
Comments
Please login to add a commentAdd a comment