krishnakumari
-
వియ్ హబ్ బ్రాండ్ అంబాసిడర్ వంట గెలిచింది
ఆమె... వంటతో జీవితాన్ని నిలబెట్టుకుంటానని, వంటలతో అవార్డులు అందుకుంటానని, వియ్ హబ్ (విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్)కి బ్రాండ్ అంబాసిడర్ అవుతానని కలలో కూడా కలగనలేదు. పాలతో కూరలు వండే గుజరాత్ వాళ్లు ఆమె చేసిన పుదీనా పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. కొబ్బరి, అరటితో మసాలాలు లేని తేలిక ఆహారం తీసుకునే కేరళ వాసులు కూడా ఆమె చేతి రుచికి ఫిదా అయ్యారు. గోవా వాళ్లకు చేపలతో కొత్త వంటలను పరిచయం చేశారామె. ఈ విజయాలన్నీ ఆమెను రాష్ట్ర సెక్రటేరియట్ వైపు నడిపించాయి. తెలంగాణ సెక్రటేరియట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ఆకుల కృష్ణకుమారి. ఊరు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మూడు చింతలపల్లి గ్రామం. నెలకు లక్షకు పైగా ఆర్జిస్తున్న కృష్ణకుమారి జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.కృష్ణకుమారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీసర్. తనకు వంటలు చేయడం, వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ ఇష్టంతో తాను చేసిన కొత్త వంటకాలను కొలీగ్స్‌కి ఇచ్చేవారామె. ‘‘మా నాన్న టైలర్. ఓ రోజు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) డీపీఎమ్ సురేఖ గారు మా షాప్‌కి వచ్చారు. నన్ను చూసి నేను చేస్తున్న పని తెలిసిన తర్వాత ఆమె నాకో డైరెక్షన్ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నా కుటీర పరిశ్రమ మొదలైంది. తొలి ఆర్డర్ యూఎస్‌కి, డాక్టర్ గీతాంజలి మేడమ్ పది వేల రూపాయల ఆర్డర్ ఇచ్చారు. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయంతో విజయవంతంగా సాగుతోంది. మిల్లెట్స్‌తో ప్రయోగాలు నన్ను నిలబెట్టాయి.’’ అన్నారు కృష్ణకుమారి.మహిళాశక్తి క్యాంటీన్డ్వాక్రా స్వయంసహాయక బృందంలో చేరిన తర్వాత తన కార్యకలాపాలను వేగవంతం చేశారు కృష్ణకుమారి. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్డీలో శిక్షణ తీసుకోవడంతోపాటు, తన ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టడంతో మొదలైన ఆమె జర్నీ సరస్ మేళా ఎగ్జిబిషన్లతో అండమాన్, కశ్మీర్ మినహా దేశమంతటికీ విస్తరించింది.ఆమె విజయపథం... ఎగ్జిబిషన్లో స్టాల్ కోసం అధికారులను అడగాల్సిన దశ నుంచి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్టాల్ పెట్టవలసిందింగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే దశకు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది జూన్ నెల రెండవ తేదీన జరిగిన వేడుకల్లో ఆమె స్టాల్ పెట్టారు. ఆ స్టాల్‌లోని ఉత్పత్తులను ఆసాంతం పరిశీలించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆమె అక్కడికక్కడే లైవ్ కౌంటర్లో వండిన తెలంగాణ రుచులకు కూడా సంతృప్తి చెందారు.డ్వాక్రా మహిళల కోసం శాశ్వతంగా ఒక వేదికను ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో ‘సెక్రటేరియట్ క్యాంటీన్ మహిళలకే ఇద్దాం’ అని నోటిమాటగా వచ్చిన ఉత్తర్వుతో అదే నెల 21న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ మొదలైంది. అందులో కృష్ణకుమారితో పాటు పదిమంది మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నారు. జయహో మహిళాశక్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిచిన్న రైతులేనా ఉత్పత్తులకు స్వాద్ అనే బ్రాండ్‌నేమ్ రిజిస్టర్ చేశాను. పరిశ్రమ దమ్మాయిగూడలో ఉంది. ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. నేను ఉదయం తొమ్మిదిన్నరకు సెక్రటేరియట్‌కు చేరుకుంటాను. తిరిగి ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదవుతుంది. యూనిట్లో నిన్న తయారైన మెటీరియల్‌ను ఈ రోజున కౌంటర్లో పెడతాను. ఏ రోజుకారోజు అమ్ముడైపోతాయి. సెక్రటేరియట్ క్యాంటీన్‌తోపాటు యూనిట్లోనే అవుట్లెట్ కూడా ఉంది. రాపిడో ద్వారా సప్లయ్ చేస్తున్నాం. వినియోగదారులు మా దగ్గరకు రావడం కంటే మేమే వినియోగదారుల దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతో మొబైల్ యూనిట్ ప్రారంభించనున్నాను.నా సక్సెస్‌కి కారణం తోటలే. పచ్చళ్లు, పొడులు ఏవి చేయాలన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోను. నేరుగా తోటలకే వెళ్లి తెచ్చుకుంటాను. భారీ స్థాయిలో పండించే వాళ్లు స్వయంగా మార్కెట్‌కు తరలించగలుగుతారు. చిన్న రైతులు తమకు తాముగా మార్కెట్‌కి తీసుకెళ్లాలంటే ఆ ఖర్చులు భరించలేరు. నేను వారి దగ్గర తీసుకుంటాను. నేను ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెషన్. నాకు ఉపాధినివ్వడంతోపాటు గుర్తింపును కూడా తెచ్చింది. ఇందులోనే భవిష్యత్తును నిర్మించుకుంటాను. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం పని చేస్తాను.– ఆకుల కృష్ణకుమారి, స్వాద్ ఫుడ్స్ -
ఎన్టీఆర్ గారి వల్లే నేను ఆ పని చేశా..
-
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
‘ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది’.... ‘అగ్గిపిడుగు’లో ఎన్టీఆర్ పక్కన కృష్ణకుమారి పాడుతూ ఉంటే ఆ జంట బాగుందనిపిస్తుంది. కురులు విరబోసుకుని, ముడి దగ్గర నక్షత్రం లాంటి ఆభరణం పెట్టుకుని ఆమె పాడుతుంటే ఏ మగాడికైనా ‘కురులలో– నీ కురులలో– నా కోరికలూగినవి’ అనే అనాలపిస్తుంది. ఈ పాట ఎంత హిట్టంటే చాలా ఆర్కెస్ట్రాలు నేటికీ ఆ పాట పాడుతూనే ఉంటాయి. ఎన్టీఆర్‌కు కృష్ణకుమారి అంటే ఆకర్షణ. అందుకే గుర్రం ఎక్కి వెతుక్కుంటూ ’‘వగలరాణివి నీవే అని ‘బందిపోటు’లో పాడుకున్నాడు. ఆమెకు దూరంగా ఉండటం వల్ల ‘ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే’ అని విరహం అనుభవించాడు. కృష్ణకుమారి మాత్రం తక్కువా? ఆమెకు కూడా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. అందుకే ‘కోవెల ఎరుగని దేవుడు కలడని’ అంటూ ‘తిక్క శంకరయ్య’లో అతడిని దేవుడిలా ఆరాధించింది. అతను పక్కన ఉన్నప్పుడు ‘మనసు పాడింది సన్నాయి పాట’ అంటూ ‘పుణ్యవతి’లో మురిసి పోయింది. ‘మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది’ తెలుసుకోమంటూ ‘లక్షాధికారి’లో తొందర పెట్టింది. ఎన్టీఆర్‌తో ‘పల్లెటూరి పిల్ల’తో మొదలైన కృష్ణకుమారి తెర అనుబంధం దాదాపు 25 సినిమాల వరకూ సాగింది. ఇక అక్కినేని, కృష్ణకుమారిది రొమాంటిక్ పెయిర్. ఆమెను చూసి అతడు ‘ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక’ అని ‘డాక్టర్ చక్రవర్తి’లో సాగుతున్న ట్రైన్లో కిటికీ పక్కన చేరి పాడుకోవడం మనమెలా మర్చిపోగలం? ‘నువ్వంటే నాకెందుకో అంత ఇది’ అని ఏయన్నార్ ‘అంతస్తులు’ సినిమాలో ఆమె కోసం పడి చచ్చినట్టుగా మరెవరి కోసమూ పడి చావలేదు. ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా’ అని ‘కులగోత్రాలు’లో ప్రాధేయ పడినట్టుగా ఎవ్వరినీ ప్రాధేయపడలేదు. ఏయన్నార్ కోమల మనస్కుడు. సున్నిత హృదయడు. అతడిని నిరాకరించడం తగదు. అందుకే ఆమె కూడా అతడి ప్రేమను అర్థం చేసుకుంది. ‘నా కంటి పాపలో నిలిచిపోరా’ అని ‘వాగ్దానం’లో అతడిని కోరింది. ‘నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా’ అంటూ ‘జమిందార్’లో మాట ఇచ్చింది. ‘పులకించని మది పులకించెను’ అంటూ ‘పెళ్లికానుక’లో ఫైనల్‌గా అతడి ప్రేమను యాక్సెప్ట్ చేసింది. తెలుగు సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ కృష్ణకుమారితో హిట్ సినిమాలు చేశారు. ఆమె ప్రమేయం పెర్ఫార్మెన్స్ కోసం కంటే గ్లామర్ కోసమే ఎక్కువ అవసరమని ఇండస్ట్రీ భావించింది. పాటలలో ఆ రోజులలో కృష్ణకుమారి చాలా హుషారుగా కనిపించేది. తెల్లచీర కట్టుకుని ఆమె చేసిన పాటలు జనాన్ని ఉడుకులాడించాయి. ‘తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము’ పాటలో ఏయన్నార్‌తో, ‘దేవతయే దిగి వచ్చి మనషులలో కలిసిన కథ’ పాటలో ఎన్టీఆర్‌తో ఆమె తెల్ల చీరలో కనిపిస్తుంది. కృష్ణకుమారి డ్యాన్సింగ్ టాలెంట్ చూడాలంటే ‘పునర్జన్మ’లోని ‘దీపాలు వెలిగె పరదాలు తొలిగె’ పాటలో చూడాలి. అంత పొడగరి వెన్నును విల్లులా వంచి నర్తిస్తుంటే కళ్లార్పబుద్ధి కాదు. కృష్ణకుమారి పాటలలో కూడా కొన్ని తమాషాలు జరిగాయి. ఒకసారి ఒక పాట షూటింగ్ ఉందనగా కృష్ణకుమారి జ్ఞానదంతం వాచి దవడ పొంగిపోయింది. షూటింగ్ తప్పించుకోవడానికి వీల్లేదు. అవతల రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఇక ఆమె ఆలోచన చేసి చెంపల మీదకు వచ్చేలా స్కార్ఫ్ కట్టుకుని పాట పాడింది. జనం అది కొత్త ఫ్యాషన్ అనుకున్నారు. మెచ్చుకున్నారు. ఆ పాట ‘చదువుకున్న ఆమ్మాయిలు’లోని– ‘కిలకిల నవ్వులు చిలికిన’... ఆ తర్వాత ఆమె కాంతారావుతో కూడా చాలా డ్యూయెట్స్ పాడింది. ‘ఇద్దరు మొనగాళ్లు’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘పేదరాశి పెద్దమ్మ’ లాంటి చాలా సినిమాల్లో వాళ్లిద్దరి పాటలు ఉన్నాయి. అయితే కృష్ణకుమారి పొడగరి. ‘చిలకా గోరింక’తో కృష్ణంరాజు వచ్చేంతవరకూ ఆమెకు ఈడూ జోడూలాంటి హీరో దొరకలేదనే చెప్పాలి. తన కాలంలో సావిత్రి, జమున సూపర్ స్టార్స్‌గా చెలామణి అవుతున్నా తన మర్యాదకరమైన వాటా తాను తీసుకోగలిగింది కృష్ణకుమారి. అన్నట్టు సావిత్రిని టీజ్ చేస్తూ అక్కినేనితో కలిసి ‘అభిమానం’లో ఆమె పాడిన ‘ఓహో బస్తీ దొరసాని ఆహా ముస్తాబయ్యింది’... కూడా చాలా పెద్ద హిట్టే. సావిత్రితో కలిసి కృష్ణకుమారి ‘వరకట్నం’లోనూ నటించింది. ఈ సీజనల్ హిట్స్ మధ్యలోనే కృష్ణకుమారిని తలుచుకోవడానికి ఇంకో మంచి పాట కూడా ఉంది. చాలా ఆహ్లాదకరమైన పాట. ఏమిటో గుర్తుందా? ‘కానిస్టేబుల్ కూతురు’లోని ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’... పట్టీల పాదాలతో పరిగెడుతూ కృష్ణకుమారి ఆ అరటి పాదుల పెరడులో పాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ తోటలో పాదులు తీస్తూ అన్నగా నటిస్తున్న జగ్గయ్య íపీబీ శ్రీనివాస్ గొంతులో ‘మా చెల్లెలు బాల సుమా ఏమెరుగని బేల సుమా’ అనడం ఎంతో మురిపెంగా అనిపిస్తుంది. కాలానిది అనంతమైన పల్లవి. అంతులేని చరణం. నడుమ దొరికిన, ఇవ్వబడిన సమయంలో కృష్ణకుమారి తన పాట తాను అందంగా పాడి ముగించింది. ఆ తెర వెలుగుకు సెలవు. – కె -
ఆ రోజు ఆమె చిరాకుపడ్డారు
కృష్ణంరాజు తొలి కథానాయిక కృష్ణకుమారి. ఆమెతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘చిలకా గోరింక’. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. తొలి హీరోయిన్ గురించి ‘సాక్షి’తో కృష్ణంరాజు చెప్పిన విశేషాలు. ► కృష్ణకుమారి కంటే మీరు దాదాపు పదేళ్లు చిన్న. ఆవిడ మీ ఫస్ట్ హీరోయిన్ అన్నప్పుడు ఎలా అనిపించింది? వయసులోనే కాదు.. హోదాలోనూ ఆమె ఎక్కువే. నేను ‘చిలకా గోరింక’ ఒప్పుకున్న సమయానికి ఆమె స్టార్ హీరోయిన్. నాకది ఫస్ట్ సినిమా. దర్శకుడు ప్రత్యగాత్మగారు కృష్ణకుమారిగారితో యాక్ట్ చేయాలన్నప్పుడు నాకేమీ అనిపించలేదు. పైగా ఆవిడ తానో పెద్ద స్టార్ అనే ఫీలింగ్‌ని ఎక్కడా బయటపెట్టలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కో–ఆపరేట్ చేసేవారు. ► అంత పెద్ద స్టార్‌తో డ్యూయెట్స్ పాడటానికి ఏమైనా ఇబ్బందిపడ్డారా? కెమెరా ముందుకెళ్లాక నాకు పర్సనల్ లైఫ్ గుర్తుకు రాదు. ఆమెను ఓ కో–స్టార్‌లానే చూశాను. కృష్ణకుమారిగారు చాలా కూల్ నేచర్. అందుకేనేమో ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. ► అంటే.. ఆమె చిరాకుపడిన సందర్భం ఒక్కటి కూడా లేదా? ఒకే ఒక్కసారి చూశాను. మేమిద్దరం క్లోజ్‌గా ఉండే సీన్స్ తీసేటప్పుడు హైట్ మ్యాచ్ చేయడానికి ఆమెను పీట మీద నిలబడమన్నారు. ప్రత్యగాత్మగారు పీట తెప్పించాక ‘కొంతమంది హీరోలు నా పక్కన పీట మీద నిలబడేవారు. ఇప్పుడు నేను నిలబడాలా?’ అని చిరాకు పడ్డారు. యాక్చువల్‌గా కృష్ణకుమారిగారు మంచి ఎత్తే. కానీ నా హైట్‌కి మ్యాచ్ అవ్వడానికి పీట వేయాల్సి వచ్చింది. ► ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి పిలిచేవారా? అవును. నా ఫస్ట్ మూవీ ‘చిలకా గోరింక’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫంక్షన్‌కి రావాలని ఆమెతో అన్నాను. ‘రాకుండానా? తప్పకుండా వస్తాను’ అన్నారు. కానీ సడన్‌గా ఇలా అయిపోయింది. మంచి నటి, మంచి వ్యక్తిని కోల్పోయాం. -
గెలిచే సత్తా ఉంది: మంత్రి దానం
బంజారాహిల్స్, నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ డివి జన్ పరిధిలో దీపం పథకం కింద మం జూరైన గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు ఆయన మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఏ డివిజన్లో ఎంత అభివృద్ధి చేశానో తాను నిరూపిస్తానని కొత్తగా వస్తున్న పార్టీల నాయకులు ఏంచేస్తారో చెబుతారా అని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా చివరకు గెలిచేది తానేనని, ఆ సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 250 మంది లబ్ధిదారులకు దీపం పథకం కింద కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ బి.భారతి, జీహెచ్ఎంసీ సర్కిల్-10 యూసీడీ డిప్యూటీ పీవో కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.