సాక్షి, కాకినాడ: ప్రముఖ సినీ హీరోయిన్ శ్రియ రాకతో కాకినాడలో సందడి నెలకొంది. మెయిన్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్‌మాల్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు. ఆ షాపింగ్ మాల్ పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రియ అభిమానులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో అభిమానులను నియంత్రించారు. ఉదయం 11 గంటలకు శ్రియ జ్యోతి ప్రజ్వలన చేసి చందన షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు.
ఆమెకు చందన బ్రదర్స్ అధినేతలు చందన రమేష్, చందన నాగేశ్వర్, అల్లక మల్లిఖార్జునరావు, సంప్రదాయ దుస్తులతో చందన సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రియ షాపింగ్‌మాల్ ఏర్పాటైన ఐదుఫ్లోర్లను సందర్శించి, వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలను తిలకించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన చందన షాపింగ్‌మాల్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా, అందుబాటు ధరల్లో ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
‘చందన’ ప్రత్యేకతను కొనసాగిస్తాం..
చందన అధినేతలు రమేష్, నాగేశ్వర్, మల్లిఖార్జునరావు మాట్లాడుతూ పురుషుల రెడీమేడ్ దుస్తుల నుంచి ఫ్యాన్సీ, పట్టుచీరలు, జ్యూయలరీ, ఫుట్‌వేర్, వన్‌గ్రామ్ గోల్డ్, బంగారు, వెండి ఆభరణాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. పేదల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరికీ అందుబాటులో నాణ్యమైన వస్త్రాలు అందించడంలో తమకున్న ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, మేయర్ సుంకర పావని, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్ కె.శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment