సినీనటి శ్వేతాబసు సందడి | Shweta Basu Prasad in Kakinada | Sakshi
Sakshi News home page

సినీనటి శ్వేతాబసు సందడి

Published Tue, Dec 15 2015 9:18 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

సినీనటి శ్వేతాబసు సందడి

సినీనటి శ్వేతాబసు సందడి

బాలాజీచెరువు (కాకినాడ) : కొత్త బంగారులోకం ఫేం, సినీ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ సోమవారం కాకినాడలో సందడి చేశారు. నగరంలోని శరవణ సిల్క్స్ షాపింగ్ మాల్‌లో.. క్రిస్మస్, సంక్రాంతి మనీ సేవింగ్స్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన వినియోగదారులు 29 మందికి డ్రా తీసి బహుమతులు అందజేశారు. కొత్త బంగారులోకం సినిమాలో పాపులర్ అయిన ‘ఎక్కాడ’ అన్న డైలాగ్‌తో అందరిని అలరించారు. కాకినాడతో తనకు మంచి అనుబంధం ఉందని, కొత్త బంగారులోకం చిత్ర యూనిట్‌తో పద్మప్రియ థియేటర్‌కు వచ్చానని, కాకినాడ కాజాలంటే చాలా ఇష్టమని చెప్పారు. కార్యక్రమంలో జూనియర్ ఆర్టిస్ట్ దత్తు, షాపింగ్‌మాల్ మేనేజర్ హుస్సేన్, ప్రొపయిటర్ సైదా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement