ఫలక్‌నుమా దాస్ చిత్రంతో కుర్ర హీరో విశ్వక్‌సేన్ యూత్‌లో అపారమైన క్రేజ్ సాధించుకున్నాడు. నాటు భాషతో, మోటు పదాలతో బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేశాడు. తాజాగా ఆయన హీరోగా ‘హిట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. రుహాని శర్మ(చి.ల.సౌ ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘దిస్ జాబ్ విల్ డిస్ట్రాయ్ యు విక్రమ్’ అనే మహిళ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. కానీ హీరో అనుకున్నది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వంలా ఉంది.
అందుకే, ఏదేమైనా సరే.. కానీ ‘డిపార్ట్‌మెంట్‌ను మాత్రం నేను వదల్లేను’ అని తెగేసి చెప్పాడీ హీరో. తక్కువ డైలాగులతో, అదరగొట్టే బీజీఎమ్‌తో రూపొందించిన టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ సినిమా ప్రధానంగా ఓ మిస్సింగ్ కేసు చుట్టూనే సాగనున్నట్లు తెలుస్తోంది. కొలను శైలేష్ ఈ మూవీతో దర్శకడుగా పరిచయం అవుతున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ‘అ!’ సినిమాతో నిర్మాణం వైపు అడుగులు వేసిన నేచురల్ స్టార్ నాని ‘హిట్’ సినిమాను నిర్మిస్తున్నాడు. చదవండి: నేనే నానీనే!
Comments
Please login to add a commentAdd a comment