మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య | Hollywood Music Director Bennington Dead in Suicide | Sakshi
Sakshi News home page

మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య

Published Sun, Jul 23 2017 12:11 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య - Sakshi

మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య

ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు బెన్నింగ్టన్ ఆత్మహత్య చేసుకున్నారు. మ్యూజిషియన్ లింకిన్ పార్క్ ట్రూప్ లో బెన్నింగ్టన్ ప్రధాన సింగర్. గిటార్ ప్లేయర్ అయిన చెస్టర్ బెన్నింగ్టన్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సహచరుడు, గీత రచయిత మైక్ షినోడ ప్రకటించారు. లాస్‌ఏంజెల్స్ కౌంటీ పోలీస్ అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

తన ఇంట్లోనే ఉరేసుకుని బెన్నింగ్టన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ప్రాథమికంగా బెన్నింగ్టన్ మరణానికి కొన్నిగంటల ముందే లింకిన్ పార్క్.. 'టాకింగ్ టు మై సెల్ఫ్' అనే వీడియో ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఈ ఆల్భమ్  బెన్నింగ్టన్ భార్య తలిందా అన్ బెంట్లే బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ పాటను చిత్రీకరించారు. రెండు వివాహాలు చేసుకున్న బెన్నింగ్టన్‌ కు ఆరుగురు పిల్లలు.

తల్లిదండ్రుల విడాకులతో తీవ్రంగా కలత చెందిన బెన్నింగ్టన్ మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడినట్టు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మృతి పట్ల లింకిన్ పార్క్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు పాప్ సింగర్లు బెన్నింగ్టన్ మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement