హాట్ సమ్మర్... కూల్ లవ్ బ్రీజ్ | Hot Summer ... Love Cool Breeze | Sakshi
Sakshi News home page

హాట్ సమ్మర్... కూల్ లవ్ బ్రీజ్

Published Wed, May 25 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

హాట్ సమ్మర్... కూల్ లవ్ బ్రీజ్

హాట్ సమ్మర్... కూల్ లవ్ బ్రీజ్

గత ఏడాది సమ్మర్‌లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో తండ్రీకొడుకుల అనుబంధాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించిన దర్శకుడు త్రివిక్రమ్. ఈసారి మండు వేసవిలో మలయ సమీరం లాంటి మరో సినిమాతో ముందుకొస్తున్నారు. అనసూయ, ఆనంద్ విహారి అనే రెండు పాత్రల మధ్య జరిగే అందమైన ప్రేమకథను ‘అ..ఆ..’గా తెరపైకి తీసుకొస్తున్నారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, నదియా ముఖ్యతారలుగా ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ ‘అ...ఆ’ చిత్రం బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది.

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. నిర్మాత మాట్లాడుతూ-‘‘జూన్ 2న సినిమా రిలీజ్ చేస్తున్నాం. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, మిక్కీ జె. మేయర్ సంగీతం ప్రధాన ఆకర్షణ. ఆడియోలో ‘యా యా’, ‘ఎల్లిపోకె శ్యామలా’ పాటలు ఇప్పటికే పెద్ద హిట్. సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు. ఆ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ ఏమిటో చూడడానికి  మరికొద్దిరోజులే ఆలస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement