ఆ పేలుళ్లలో హృతిక్ బలయ్యేవాడు! | Hrithik Roshan was at Istanbul airport hours before attack | Sakshi
Sakshi News home page

ఆ పేలుళ్లలో హృతిక్ బలయ్యేవాడు!

Published Wed, Jun 29 2016 10:07 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

ఆ పేలుళ్లలో హృతిక్ బలయ్యేవాడు!

ఆ పేలుళ్లలో హృతిక్ బలయ్యేవాడు!

ముంబయి: హృతిక్ రోషన్ ఆయన కుమారులకు ప్రాణగండం తప్పింది. మరికొద్ది గంటలు అక్కడే ఉంటే వారి ప్రాణానికి ముప్పు ఏర్పడి ఉండేదేమో.. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపి దాదాపు 40మందిని పొట్టన బెట్టుకొని 150మంది వరకు గాయపరిచిన విషయం తెలిసిందే. అదే విమానాశ్రయంలో దాడికి కొన్ని గంటల ముందు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన కుమారులు రెహాన్, రిధాన్తో కలిసి అదే విమానాశ్రయంలో ఉన్నారు.

ఓ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయి మరో విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు దొరక్కపోవడంతో ఆయన అక్కడే ఎదురుచూశారు. అయితే, విమాన సిబ్బంది సహాయంతో తిరిగి ఎకానమీ ఫ్లైట్లో బయలుదేరారు. అలా వారు బయలుదేరిన కొద్ది సేపటికే విమానశ్రయంలో పేలుళ్ల ఘటన జరిగింది. ఈ సంఘటన గురించి తెలుసుకొని హృతిక్ ఉలిక్కిపడ్డాడు. విమాన సిబ్బంది సహాయం వల్ల తాము రెప్పపాటులో దాడి నుంచి తప్పించుకోగలిగామని చెప్పారు. తన ప్రార్థనలు ఇస్తాంబుల్ వైపు ఉంటాయని ట్వీట్ చేశారు. 'మతం పేరిట అమాయకులను చంపేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యం నిలబడాలి' అని హృతిక్ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement